English | Telugu

కైలాష్ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టిన వేద‌

స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్, డెబ్జాని మోడ‌క్ కీల‌క జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ న‌టించారు. పేమ‌గా తీసుకొచ్చిన గౌన్ వేసుకుంటే య‌ష్ చెప్పాపెట్టకుండా ముంబై వెళ్లిపోయాడ‌ని వేద ఫీల‌వుతూ వుంటుంది. అయితే య‌ష్ మాత్రం త‌న ద‌గ్గ‌రికే వ‌చ్చి ష‌ర్ట్ బ‌ట‌న్ ఊడింద‌ని చెబుతాడు.

ఆ త‌రువాత నేను కుట్టేస్తాను గా అంటూ వేద బ‌ట‌న్ కుట్ట‌డం మొద‌లు పెడుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ మూడ్ మొద‌ల‌వుతుంది. క‌ట్ చేస్తే.. వేద‌ని ఆ డ్రెస్ లో చూసిన కైలాష్ భ‌లే దొరికావ్ వేద‌.. య‌ష్ రెండు రోజుల వ‌ర‌కు ముంబై నుంచి తిరిగి రాడు.. ఈ స‌మ‌యాన్ని అనుకూలాంగా మార్చుకుని నిన్ను సొంతం చేసుకోవాలి అని ప్లాన్ చేస్తాడు. వేద ఒంట‌రిగా వున్న స‌మ‌యం చూసుకుని త‌న బెడ్రూమ్ లోకి ప్ర‌వేశిస్తాడు. ఆద‌మ‌రిచి వున్న వేద‌ని కౌగిలించుకుంటాడు.

ఏం జ‌రుగుతోందో ప‌సిగ‌ట్టిన వేద వెంట‌నే తేరుకుంటుంది. హాల్లోకి ప‌రుగున వ‌చ్చి య‌ష్ త‌ల్లికి విష‌యం చెప్ప‌బోతూ ఎమోష‌న‌ల్ అవుతుంది. ఏం జ‌రిగింది వేద అని య‌ష్ త‌ల్లి మాలిని అడ‌గ‌డంతో వావి వ‌రుస‌లు మ‌రిచి నన్ను కైలాష్ కౌగిలించుకుని అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌బోయాడ‌ని, నీచంగా బిహేవ్ చేశాడ‌ని ఏడుస్తూ చెబుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? కైలాష్ చేసిన ప‌నికి మాలిని ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.