English | Telugu

ఇమ్ము పొలంలో మొలకలొచ్చేలా చేసిన ఫరియా

ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు మూవీతో చిట్టిగా అందరి మనస్సులో నిలిచిపోయింది. త్వరలో ఈమె సుధీర్ వర్మ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ‘రావణాసుర’ లో కనిపించబోతోంది. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ప్రపంచవ్యాప్తంగా ‘రావణాసుర’ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఐతే ఇప్పుడు ఈమె బుల్లితెర మీద కనిపించి అలరించింది. "ఉగాది మాస్ ధమాకా అవార్డ్స్" షోలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ ప్రోగ్రాం మార్చ్ 19 న జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతోంది. ఈ ఈవెంట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. తర్వాత ఇమ్మానుయేల్ జాతిరత్నాలు మూవీలో సాంగ్ కి ఫరియా అబ్దుల్లాతో కలిసి డాన్స్ చేసాడు.

"నెత్తి మీద మొలకలు రాని నాకు పొలంలో మొలకలు వచ్చేలా చేశారు." అనేసరికి ఫరియా నవ్వేసింది. ఇమ్ము పక్కన నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఆమె వైపు తలెత్తి చూసి "మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు" అని కామెడీ చేసాడు. "ఈ మూవీలో నేను లాయర్ ని అండి" అని ఫరియా చెప్పేసరికి "జాతిరత్నాలు లాయర్" అని శ్రీముఖి అరుస్తూ చెప్పింది. ఫరియా రవి కృష్ణతో అలాగే దిలీప్ తో కలిసి డాన్స్ చేసి ఎంటర్టైన్ చేసింది. ఈ బ్యూటీ మూవీస్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ పక్కన కనిపించబోతున్న ఈ అమ్మడు మూవీలో ఎలా నటించిందో తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.