English | Telugu
హోలీ సంబరాల్లో రిషీధారలు!
Updated : Mar 14, 2023
స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -709 లో.. రిషిని పిలవకుండానే ఇంట్లో జగతి,మహేంద్ర, ఫణింద్ర, వసుధార అందరూ కలిసి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటారు. అది చూసిన రిషి.. వీళ్ళంతా కావాలనే తనని పిలవలేదని అనుకుంటాడు. రిషి కిందకి వస్తుండగా వసుధారకి డాష్ ఇస్తాడు. ఆ తర్వాత "మనుషులని అర్థం చేసుకొనే బుక్స్ దొరుకుతాయి చదవండి సర్" అని వసుధార అంటుంది. "జెంటిల్ మెన్ అండ్ ప్రిన్స్ లాంటి పుస్తకాలే చదివాను" అని రిషి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
వసుధార తన గదిలో బాధపడుతుంటుంది. రిషి సర్ మొదట్లో నా మీద కోపం ఉన్నా కూడా పైకి నవ్వుతూ ప్రేమగా పలకిరించేవాడు. ఇప్పుడు ప్రేమ ఉన్నా బయటికి కోపంగా మాట్లాడుతున్నాడు. రిషి సర్ బాధపడకుండా చూడాలని వసుధార అనుకుంటుంది. రిషి మరుసటి రోజు ఉదయం లేచి వసుధార కోసం ఇల్లంతా చూస్తాడు. "వసుధార ఏంటి ఎక్కడా కనిపించడం లేదు" అని మహేంద్రని రిషి అడుగుతాడు. "ఏమో రిషి.. జగతి కూడా కనిపించడం లేదు" అని మహేంద్ర అంటాడు.
ఇంతలో రిషికి మెసేజ్ చేస్తుంది వసుధార. "సర్ త్వరగా రండి.. లొకేషన్ షేర్ చేస్తున్నా" అని మెసేజ్ చెయ్యడంతో.. రిషి తొందరగా వెళతాడు. ఇక అలాగే మహేంద్రకి కూడా జగతి మెసేజ్ చేసి రమ్మంటుంది. అలా మహేంద్ర వెళ్తుండగా.. అతని దగ్గరికి దేవయాని వచ్చి.. జగతి, వసుధారలు ఎక్కడికి వెళ్ళారు. ఇప్పుడు రిషి ఎక్కడికి వెళ్తున్నాడని అడుగుతుంది. "నాకేం తెలియదు" అని మహేంద్ర సమాధానం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వసుధార దగ్గరికి వెళ్ళిన రిషి.. "ఏంటి వసుధార.. నువ్వు ఇలా చెప్పకుండా వస్తే ఎంత టెన్షన్ అవుతుంది" అనికోప్పడతాడు. అప్పుడు వసుధార కూల్ గా ఉండండని అంటుంది. ఆ తర్వాత "హ్యాపీ హోలీ" అంటూ రిషి చెంపలపై కలర్ పూస్తుంది.
రిషి మొదట కోప్పడినా తర్వాత కూల్ అయి వసుధారకి కూడా కలర్ పూస్తాడు. అలాగే జగతి "హ్యాపీ హోలీ రిషి" అని చెప్పగానే.. కొద్దిసేపు సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత "హ్యాపీ హోలి" అంటూ చెప్తాడు. అలా అందరూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ జరుపుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.