English | Telugu
"ఈ రోజుల్లో" మూవీ అనుకోకుండా మిస్ చేసుకున్నా...
Updated : Sep 16, 2023
స్మాల్ స్క్రీన్ మీద బ్రహ్మముడి సీరియల్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే కొన్ని ప్రైవేట్ సాంగ్స్ లో కూడా మెరిశాడు. "జరీజరీ పంచెకట్టు"అనే సాంగ్ తో ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మానస్ బుల్లితెర సీరియల్స్ బిజీగా మారిపోయాడు. అయితే ఈయన సీరియల్స్ లోకి రాకముందు కొన్ని మూవీస్ లో నటించాడు మానస్. కానీ పెద్దగా పేరు రాలేదు.
మానస్ తన సినీ కెరియర్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పాడు మానస్ . మారుతి డైరెక్షన్ లో వచ్చిన "ఈ రోజుల్లో" మూవీలో హీరోగా నటించే అవకాశం ముందు తనకే వచ్చిందని అయితే మారుతి గారిపై నమ్మకం లేక మూవీ ఛాన్స్ ని వదులుకున్నట్టు చెప్పాడు.
ఐతే ఆ మూవీ మంచి హిట్టు కొట్టిందన్నారు. ఈ మూవీ ద్వారానే ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మారుతీ గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పారు. ఇక ఈ మూవీ స్టోరీని తనకు చెప్పి ఫస్ట్ టైం డిజిటల్ టెక్నాలజీలో 5డీ కెమెరాతో ప్రయోగాత్మకంగా మూవీ తీస్తున్నట్లు తనకు చెప్పారన్నారు. అప్పటికి అంత మెచ్యూరిటీ లేకపోవడం వల్ల "ఈ రోజుల్లో" మూవీ అవకాశాన్ని మిస్ చేసుకోవడం చాలా బాధను కలిగించిందన్నారు..ఆ సినిమా విడుదలై పెద్ద విజయాన్ని సాధించడమే కాకుండా డిజిటల్ టెక్నాలజీకి ఓ బెంచ్‌మార్క్‌గా మారిందని చెప్పారు. ఆ తర్వాత మారుతి నిర్మాణంలోనే రెండు సినిమాలు చేసినట్లు చెప్పాడు మానస్..."కాయ్ రాజా కాయ్, గ్రీన్‌సిగ్నల్, సోడా గోలీ సోడా, ప్రేమికుడు"తో పాటు కొన్ని మూవీస్లో హీరోగా నటించాడు మానస్. కానీ ఆ మూవీస్ ఏవీ ఆయనకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత సీరియల్స్‌పై ఫోకస్ పెట్టాడు మానస్. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్‌లో రాజ్ గా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సీరియల్ తో మానస్ మరింత ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు.