English | Telugu

పల్లవి ప్రశాంత్ ఎలిమినేషన్.. ఓటింగ్ లో శివాజీ టాప్!

బిగ్ బాస్ సీజన్-7 రోజురోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. అయితే సోమవారం నామినేషన్లు, శనివారం హోస్ట్ నాగార్జున వచ్చి ఒక్కో కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ చూసి కొందరిని తిడుతూ మరికొందరిని‌ మెచ్చుకుంటాడు. అయితే ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది. కాగా ఇప్పటికే హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరెంటని బిగ్ బాస్ ప్రేక్షకులకు అర్థమైంది. అయితే ఈ వారం ఒక్కొక్కరికి హోస్డ్ నాగార్జున చాలా గట్టిగానే క్లాస్ పడేలా ఉంది. అమర్ దీప్ కంటెస్టెంట్స్ ని రారా, పోరా, వినురా అంటూ మర్యాద లేకుండా మాట్లాడటాన్ని ఇప్పటికే ప్రేక్షకులు తీసుకులేకపోతున్నారు.

పల్లవి ప్రశాంత్ ఎలిమినేట్ అవుతాడా అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. దీనికి కారణం లేకపోలేదు. సీజన్-7 మొదలైందే ఉల్టా పల్టా థీమ్ తో.. అంటే సాధారణంగా ప్రతీ సీజన్ లో లాగా ఓటింగ్ లో చివరన ఉండేవాళ్ళని కాకుండా ఈ సారి ఉల్టా పల్టా చేసి.. టాప్ లో ఉండేవారిని ఎలిమినేట్ చేస్తారేమో అని తెలుస్తోంది. కాగా టాప్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. శివాజీ సెకండ్ స్థానంలో ఉన్నాడు. ఇక రతిక మైండ్ గేమ్ పనిచేయకపోగా, కంటెంట్ కోసం నటిస్తోందని ప్రేక్షకులకు ఇప్పటికే అర్థం అయింది. దాంతో తను అయిదవ స్థానానికి పడిపోయింది. ఇక టేస్టీ తేజ, షకీల ఉన్నారా లేదా అనిపిస్తుంది. వీరిద్దరికి ఈ వారం కష్టమే ఎవరో ఒకరు కన్ఫమ్ ఎలిమినేషన్ అవుతారని తెలుస్తుంది.

కార్తీక దీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభా శెట్టి.. సీరియల్ లో లాగా నటించలేకపోతుంది. తనేం చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది‌. ఎలిమినేషన్ లో ఉండే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పుడు తాజాగా ఓటింగ్ లిస్ట్ లోకి యావర్, గౌతమ్ చేరారు. నిన్న జరిగిన ఎపిసోడ్ తో వీరిద్దరి గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. శివాజీ మాస్ ఎలవేషన్ తో బిగ్ బాస్ లో స్ట్రాంగ్ అవుతున్నాడు. అందరి కంటెస్టెంట్స్ కి ఒక పెద్ద దిక్కులా మారాడు. వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడుతూ శివాజీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు. ఇక శనివారం వచ్చే ప్రోమో కోసం బిగ్ బాస్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే సోమవారం జరిగిన నామినేషన్లలో ఎవరిది తప్పని నాగార్జున చెప్తాడా లేక వదిలేస్తాడా అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలోను నెలకొంది. అమర్ దీప్ వైపు నాగార్జున మాట్లాడితే వరెస్ట్ హోస్ట్ అని ట్యాగ్ లు చేస్తూ బిగ్ బాస్ ప్రేక్షకులు తిట్టేలా ఉన్నారు. ఈ ప్రోమో ఎలా ఉంటుందో చూడాలి మరి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.