English | Telugu

టిఆర్పిలు బద్దలవ్వాల్సిందే...ఈ సంక్రాంతికి ఆ క్యూట్ జంట  

సంక్రాంతి సంబరాలు అంటే ఆ మజానే వేరు మచ్చా. ఎందుకంటే కోడి పందేలు, పేకాట, పట్టు చీరలు, ముగ్గులు, ఎడ్ల పందాలు...ఇవే ఈ పండక్కి బ్రాండ్ థింగ్స్. ఐతే బుల్లితెర మీద సంక్రాంతి అంటే అబ్బో ఆ రేంజ్ వేరు..ఐతే ఈ సంక్రాంతికి మరి ప్రతీ ఇంటికి అల్లుడు రాబోతున్నాడు. అదేనండి సుడిగాలి సుధీర్. "ఈ సంక్రాంతికి వస్తున్నాం" అంటూ ఒక షో త్వరలో సంక్రాంతి సందర్భంగా రాబోతోంది. దానికి సుధీర్ హోస్ట్ గా వస్తున్నాడు. "ఎక్కడైనా అల్లుడొచ్చాక పండగ జరుగుద్ది. కానీ ఇక్కడ మాత్రం పండగ చేయడానికి అల్లుడొచ్చాడు" అంటూ స్టైలిష్ సుధీర్ డైలాగ్ చెప్పాడు. ఇక స్మాల్, బిగ్ స్క్రీన్స్ లో కనిపించే వాళ్లంతా ఈ షోకి వచ్చారు. ఇక మళ్ళీ సుధీర్ - రష్మీ లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది. ఇద్దరూ కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి మెస్మోరైజింగ్ పెర్ఫార్మెన్స్ చేసారు. ఇక రష్మీ కాలికి పట్టీ తొడిగాడు సుధీర్. ఇక నెటిజన్స్ ఐతే ఫుల్ ఖుష్ లో ఉన్నారు.

ఎస్-ఆర్ జోడి కం బ్యాక్ ఇచ్చారు, సుధీర్ - రష్మీకి పెళ్లి చేసేయండి, ఈ సంక్రాంతికి ఈవెంట్ బ్లాక్ బస్టర్, ఎన్నాళ్లకు కనులకు విందు, వీళ్ళ జోడి ఎవర్ గ్రీన్. టిఆర్పి ఎక్కడికో వెళ్ళిపోద్ది..ఈటీవీకి అందం వచ్చింది. సుధీర్ ఉంటేనే ఆడియన్స్ హాయిగా నవ్వుకుంటారు " అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రష్మీ, సుధీర్ జోడి ఏపీకీ బుల్లితెర మీద ఎవర్ గ్రీన్ జోడి అని చెప్పొచ్చు. ఇక హైపర్ ఆది ఐతే అల్లు అర్జున్ ని ఇమిటేట్ చేసి బుల్లితెర పుష్ప అనిపించుకున్నాడు. "ఈ సంక్రాంతికి ఎవ్వరైనా గాని అస్సలు తగ్గేదెలా" అంటూ చెప్పుకొచ్చాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.