English | Telugu

దుబాయ్ లో గోల్డ్ ఇంత చీపా!

జబర్దస్త్ పవిత్ర.. ఇప్పుడు అందరికి సుపరిచితమే. జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్ తో అందరి ప్రశంసలు పొందిన పవిత్ర.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. జబర్దస్త్ స్టేజ్ మీద తన సత్తా నిరూపించుకొని ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. జీతెలుగులో వస్తున్న సూపర్ క్వీన్ లో వాళ్ళ అమ్మని తీసుకొచ్చి తన జీవితం ఎలా ఉందో చెప్తూ ఎమోషనల్ అవడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

జబర్దస్త్ ఎంతో మంది ఆర్టిస్ట్ లకి అవకాశం ఇచ్చింది. ఇందులో తమ కామెడీతో నవ్వించి, సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నవారు చాలామందే ఉన్నారు. అయితే ఒకప్పుడు జబర్దస్త్ లో ధనరాజ్, వేణు, సుడిగాలి సుధీర్, చలాకీ చంటి, చమ్మక్ చంద్ర లతో సూపర్ స్కిట్ లతో సక్సెస్ అయిన జబర్దస్త్.. ఇప్పుడు టీఆర్పీలోనూ వెనుకబడింది. అయితే కొత్తగా ఆర్టిస్ట్ లను తీసుకొని కొత్త టీం లీడర్స్, కొత్త టీమ్స్ ని తీసుకొని మళ్ళీ కామెడీని సరికొత్తగా తీసుకొస్తుంది జబర్దస్త్‌. ఇలా కొత్తగా వచ్చిన వారిలో నూకరాజు, ఇమాన్యుయల్, పవిత్ర లాంటి వారు ఉన్నారు. అయితే జబర్దస్త్ కామెడీ షోలో ఒకప్పుడు లేడీ కమెడియన్లు ఉండేవాళ్ళు కాదు. అబ్బాయిలే అమ్మాయిల వేషం వేసుకొని కామెడీ చేసేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బాగానే కన్పిస్తున్నారు. భాస్కర్ టీం, వెంకీ మంకీస్ టీం, రాకెట్ రాఘవ టీం ఇలా అందరి టీంలలో కామన్ గా ఉంటున్న పవిత్ర.. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటుంది.

ఇమాన్యుయల్ తో కలిసి పవిత్ర రెగ్యులర్ రా రీల్స్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంటుంది. కాగా ఆ వీడియోలకి విశేష స్పందన లభిస్తుంది. అయితే పాగల్ పవిత్ర పేరుతో తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసింది. అందులో రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ అందరికీ దగ్గరవుతుంది. అయితే తాజాగా తను దుబాయ్ టూర్ కి వెళ్ళిందనే విషయం తెలిసిందే. 'దుబాయ్ ఎడారిలో మా తిప్పలు' అని వ్లాగ్ చేయగా అది ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. అయితే దుబాయ్ లో బంగారం మరీ ఇంత చీపా అంటూ మరొక వ్లాగ్ చేసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది పవిత్ర. ఇందులో పవిత్ర ఏం తీసుకుంది? ఎవరెవరు ఉన్నారు? తనకి బంగారం తీసుకుందా లాంటి విషయాలన్నీ వివరిస్తూ వ్లాగ్ లో చేసింది పవిత్ర. కాగా ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తోంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.