English | Telugu

నీ గాలి మాటల్ని ఖాళీగా ఉన్న ప్రదీప్ కి చెప్పు..

డ్రామా జూనియర్స్ సీజన్ 6 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రతీ వారం చిన్నారులు చేస్తున్న స్కిట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత పెద్ద డైలాగ్స్ ని ఐనా సరే అవలీలగా చెప్పేసి ఆడియన్స్ ని మెస్మోరైజ్ చేసేస్తున్నారు. ఇక ఆదివారం రాత్రి ప్రసారం కాబోయే ఈ షోకి "బేబీ" మూవీ నుంచి హీరో హీరోయిన్స్ వచ్చారు. వీళ్ళు మంచి ఎనెర్జీతో వచ్చి స్టేజి మీద స్టెప్పులేసి అందరిలోనూ హుషారు పెంచితే చిన్నారి కంటెస్టెంట్స్ ఐన లోకేష్ , భారతి మాత్రం స్కూల్ యూనిఫామ్ లో వచ్చి "అమ్మాయే సన్నగా" అంటూ పవన్ కళ్యాణ్ సాంగ్ కి దుమ్ము లేపే డాన్స్ వేసి అందరిని ఫిదా చేసేసారు. స్టూడెంట్ లోకేష్, భారతి ఎనెర్జీ కానీ డైలాగ్ డెలివరీ కానీ వేరే లెవెల్ లో ఉంటుంది. పనిలో పనిగా హోస్ట్ ప్రదీప్ మీద కూడా పంచెస్ పేల్చేశారు ఇద్దరూ. పవన్ కళ్యాణ్, భూమిక నటించిన ఖుషి మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందులో భూమిక బొడ్డు సీన్ కూడా అంతే హిట్ అయ్యింది. ఆ సీన్ ని ఈ చిన్నారులిద్దరూ రీక్రియేట్ చేసి నవ్వు తెప్పించారు.

"హే మధు ఏంటి స్కూల్ కి లేట్ గా పర్లేదు కానీ..ఎగ్జామ్ కి లేట్ గా వస్తారా..కొంచెం ఐనా సీరియస్ నెస్ ఉండదా " అని లోకేష్ పవన్ కళ్యాణ్ స్టయిల్లో అదే మానరిజమ్ తో చెప్పేసరికి సెట్ లో ఉన్నవాళ్ళంతా విజిల్స్ వేశారు. లోకేష్ డైలాగ్ కి మరో కంటెస్టెంట్ భారతి కౌంటర్ ఇచ్చేసింది "నీ గాలి మాటలు ఖాళీగా ఉన్న ప్రదీప్ కి చెప్పు ..వింటాడు" అంది.. ఆ మాటలకూ ప్రదీప్ నవ్వుతూ "మధ్యలో నేనేం చేసానురా..బుద్దిగా ఎగ్జామ్ రాసుకోవచ్చు కదా" అని భారతికి చెప్పాడు ప్రదీప్. " ఆ పనేదో నువ్వు చేసుంటే హాయిగా బిటెక్ పాసయ్యేవాడివిగా" అంది భారతి "వీళ్లకు కూడా తెలిసిపోయిందిరా మనం మధ్యలో ఆపేశామని" అన్నాడు ప్రదీప్ నవ్వుతూ. ఇలా ఈ వారం చిన్నారులంతా మంచి హుషారెత్తించే స్కిట్స్ తో నవ్వించడానికి రాబోతున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.