English | Telugu

మహేష్ బాబుకి వయసే అవదా


రాజన్న మూవీ ద్వారా చక్కటి నటన ప్రదర్శించి "యాని " ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఆమె పండించిన ఎమోషన్స్ కు ఏడవని వారు ఎవరూ లేరు. ఈ సినిమాకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డ్ అందుకుంది. 'అనుకోకుండా ఒక రోజు' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన యాని రాజమౌళి డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన ‘విక్రమార్కుడు’ మూవీలో కూడా నటించింది. ‘రంగస్థలం’ మూవీలో రాంచరణ్ చెల్లెలిగా చేసింది. అలాంటి యాని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను చెప్పింది. "యాన్జిబి అనేది నా రియల్ నేమ్. మా నాన్న పేరు నా పక్కన వస్తుంది. పర్సనల్ గా నాకు ప్రభాస్ గారు ఇష్టం..యాక్టింగ్ పరంగా వెంకటేష్ గారు ఇష్టం.

మహేష్ బాబు గారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆయన జోన్ లో ఆయన ఉన్నారు. ఆయన చాలా హ్యాండ్సమ్. నాకు ముందంతా క్రష్ అలాంటిది ఏమీ లేదు కానీ...ఆయన రిలీజ్ చేసే ఫొటోస్ చూసాక ఓ మై గాడ్..ఆయనకు వయసే అవదా అనిపించేది. ముద్దపప్పు, ఆవకాయ్, అప్పడం..అలాగే ఫిష్ అన్నా చాలా ఇష్టం. రాజన్న మూవీ ఎప్పటికీ నా ఫేవరేట్...సాయి పల్లవి గారు నా ఇన్స్పిరేషన్. ఆమె చేసే లాంటి రోల్స్ చేయాలి. ఐతే రొమాంటిక్ క్యారెక్టర్లు మాత్రం వచ్చినా చేయను.

నాకు శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ మీద క్రష్ ఉండేది. తన జుట్టు, కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఇప్పుడు నన్ను ట్రై చేసుకోవచ్చు. రిలేషన్ షిప్ కి వెళ్తానని చెప్పడం నా ఉద్దేశం కాదు. సీతారామం మూవీలో సీత లెటర్స్ రాసినట్టు మీరు కూడా నాకు లెటర్స్ రాసి ఇంప్రెస్ చేయొచ్చు. నేను రామ్ లా ఉంటాను. ఇకపోతే మణిరత్నం గారు , రాజమౌళి, సుకుమార్ గారు ఇష్టం. " అని చెపింది యాని. ఐతే ఈమె సినిమాల్లోకి ఇంకా రీఎంట్రీ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్యా క్టివ్ గా ఉంటూ అందాలను ఆరబోస్తోంది. తన మూవీస్ గురించి, ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.