English | Telugu

దమ్మున్న కొరియోగ్రాఫర్స్ తో రాబోతున్న ఢీ ప్రీమియర్ లీగ్


సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ డాన్స్ షోగా ‘ఢీ’ ఎంతో పేరు తెచ్చుకుంది. ఈటీవీలో ఇప్పటివరకు 15 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షో ద్వారా టాలీవుడ్ కి ఎంత మంది కొరియోగ్రాఫర్స్ ని ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు..అంతటి చరిత్ర ఉన్న షో ఇది. ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ని సోమేష్ మాష్టర్ సొంతం చేసుకుని వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు ఢీ సీజన్ 16 స్టార్ట్ ఐపోతోంది. జూన్ 21 వ తేదీ రాస్తే 9 . 30 కి ..క్రికెట్ లో ప్రీమియర్ లీగ్స్ చూసి ఉన్నాం. కానీ ఇప్పుడు ఢీ ప్రీమియర్ లీగ్ చూడబోతున్నాం.

ఇందులో 8 టీములు ఉండబోతున్నాయి...ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి 40 మంది కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు. ఇక ఈ న్యూ ఎపిసోడ్ టీజర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో చూస్తే గనక గత ఎపిసోడ్స్ లో దుమ్ము రేపిన కొరియోగ్రాఫర్స్ అంతా ఈ ప్రోమోలో కనిపించారు. వాళ్ళే గ్రీష్మ, ఐశ్వర్య, అభి, కన్నా, సాయి మాస్టర్స్ . మరి మిగతా కొరియోగ్రాఫర్స్ ఎవరు అనే విషయం లాంచింగ్ ఎపిసోడ్ లో తెలిసిపోతుంది.

వీళ్లంతా గత సీజన్స్ పోటా పోటీగా చేసిన వాళ్లే. ఇక ఈ కొత్త సీజన్ ప్రోమో మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటోంది. గత సీజన్ లాంచింగ్ ఎపిసోడ్ కి ప్రభుదేవా వచ్చారు. ఐతే ఈ న్యూ సీజన్ కి ఎవరు వస్తారు అనే విషయం ఇంకా తెలియలేదు. గత ఎపిసోడ్స్ లో వన్ ఆఫ్ ది జడ్జిగా ఉన్న పూర్ణ మరి ఈ డిపఎల్ నుంచి కనిపించబోతున్నారా అంటే వస్తున్నారని అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఆడియన్స్ అడిగిన ప్రశ్నల్లో త్వరలో వస్తాను అని కూడా చెప్పడం చూసాం. ఇప్పుడు ఈ న్యూ సీజన్ కి మరి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.