English | Telugu

సింగిల్ మామ్స్ కి హ్యాపీ ఫాదర్స్ డే అంటున్న జ్యోతి

అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న మాత్రం జీవితాంతం తన భుజాల మీద మోస్తూనే ఉంటాడు. అలాంటి ఫాదర్స్ డే ఒక్కొక్కరు ఒక్కో రకంగా జరుపుకున్నారు. బుల్లితెర మీద ఎంతో మంది వాళ్ళ నాన్నలతో కలిసున్న ఫొటోస్ ని పోస్ట్ చేసుకున్నారు...కేక్స్ తినిపించుకున్నారు..రకరకాలుగా సెలెబ్రేట్ చేసుకున్నారు. నాన్న మీద ఎన్నో రకాల మెసేజెస్ కూడా పోస్ట్ చేశారు. ఐతే నటి జ్యోతి మాత్రం డిఫరెంట్ గా ఒక మెసేజ్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. జ్యోతి బిగ్ బాస్ తెలుగు సీజన్-1 లో పార్టిసిపేట్ చేసింది. కొన్ని మూవీస్ లో ఐటెం సాంగ్స్ చేసి పాపులర్ అయ్యింది. తెలుగులో గుడుంబా శంకర్ , ఎవడి గోల వాడిది, రంగ ది దొంగ, అందరు దొంగలే, పెళ్ళాం ఊరెళితే వంటి వాటిల్లో సైడ్ రోల్స్ లో కైపెక్కించే చూపులతో ఆడియన్స్ ని తన వైపు తిప్పుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది.

ఆమె ఇన్స్టాగ్రామ్ లో తన అప్ డేట్స్ తో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు ఫాదర్స్ డే సందర్భంగా ఒక ఇంటరెస్టింగ్ కామెంట్ పెట్టింది. "అమ్మ, నాన్న రెండు బరువుని, బాధ్యతను మోస్తున్న ఒంటరి తల్లులకు హ్యాపీ ఫాదర్స్ డే" అని చెప్పింది. నిజమే కదా సింగల్ పేరెంట్ అంటే చాలు సొసైటీలో ఒక చిన్న చూపు ఉంటుంది. ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. అలాంటి ఎంతో మంది సింగల్ మామ్స్ మన చుట్టూ ఉన్నారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకుని ఈ మెసేజ్ పెట్టింది నటి జ్యోతి. రీసెంట్ గా ఆమె డైరెక్టర్ ఈవీవీ తనను ఎలా ఇబ్బంది పెట్టారో కూడా చెప్పింది. కితకితలు మూవీ షూటింగ్ లో డైరెక్టర్ చెప్పిన సీన్ చేయలేను అని చెప్పి సెట్ లోంచి బయటకు వచ్చేసిన విషయాన్నీ చెప్పింది.



Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.