English | Telugu
కన్నీళ్లు పెట్టుకున్న డాన్సర్ చక్రపాణి...షూ గిఫ్ట్ గా ఇచ్చిన అతని వైఫ్
Updated : Aug 21, 2023
"ఢీ " ప్రీమియర్ లీగ్ లేటెస్ట్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా రిలీజ్ అయింది. ఈ షోకి ఈ వారం బిగ్ బాస్ సీజన్ - 4 లో అందరి మనసులను దోచుకున్న సయ్యద్ సోహల్ తన బ్లాక్ బస్టర్ మూవీ "మిస్టర్ ప్రెగ్నంట్" ప్రోమోషన్స్ కోసం వచ్చాడు. అలాగే హైపర్ ఆది "పెద్దరాయుడు" గెటప్ వేసి అందరిని గుడుపుబ్బ నవ్వించాడు. కొరియోగ్రాఫర్ అభి వచ్చి "అదెంటీ ఆది అన్న మనం ఇద్దరం కలిసి ఎన్నో సీజన్స్ చేశాం కదా" అని అడిగితే, "మరి అన్నయ్య నాకోకటి దొరికింది, ఇద్దరం కలిసి తిందాం అని ఏరోజైనా పిలిచావా" అని కామెడీ చేసేసరికి శేఖర్ మాష్టర్ పడీ పడీ నవ్వేసాడు. తరువాత సైరా రాయలసీమ్ వెర్సెస్ బెజవాడ టైగర్స్ గ్రూప్స్ మధ్య డాన్స్ కాంపిటీషన్ జరిగింది. రెండు టీమ్ డాన్సర్స్ ఇద్దరు పోటా పోటీగా చేశారు. ఇక ఈ షోలో హైలైట్ గా నిలిచాడు "చక్రపాణి". అతని గురించి ప్రదీప్ చెప్పేసరికి అందరికీ కన్నీళ్లు వచ్చేసాయి. చక్రపాణి కూడా ఏడ్చేశాడు.
"చక్రపాణికి డాన్స్ అంటే చాలా చాలా ఇష్టం. 22 ఏళ్లుగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఫైనాన్షియల్ గా ఇబ్బందులు వచ్చినా వదలకుండా ప్రయత్నిస్తునే ఉన్నాడు. అలా తన జర్నీని కంటిన్యూ చేస్తూనే ఇక్కడి వరకు వచ్చాడు" అని చెప్పాడు ప్రదీప్. అలా తర్వాత తన భార్య పిల్లల గురించి చెప్పాడు చక్రపాణి. "నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను" అని తన భార్య భరోసా ఇచ్చిందని చెప్పాడు. ఇంతలో స్టేజి మీదకు వచ్చారు చక్రపాణి భార్యాపిల్లలు. ఇక వస్తూనే ఆమె తన భర్త చక్రపాణికి మంచి కాస్ట్లీ షూ గిఫ్ట్ గా ఇచ్చారు. తరువాత నెల్లూరు నెరజాణలు వెర్సెస్ కొనసీమ పందెంకోళ్ళకి మధ్య పోటీ జరిగింది. ఇంతలో హైపర్ ఆది అదరిపోయే స్కిట్ చేసి, అందరిని నవ్వించాడు. ప్రైజ్ మీద ఉన్న ప్రదీప్ అలాగే డాన్నర్లు అందరూ ఆ స్కిట్లో మైద్యుడు. ఆ డాన్స్ పోటీలో ఎవరూ గెలుస్తారో వేచి చూడాలి. ఇక చివరిలో అన్ని గ్రూప్స్ కలిసి స్టేజి మీద డాన్స్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాయి.