English | Telugu

శృతి మరో సాయి పల్లవి కాబోతోంది...మీకు ఒక మంచి సినిమా రావాలి..


ఢీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఒక్కో డాన్స్ ఒక్కో రేంజ్ లో ఉంది. ముఖ్యంగా సాగర్ - శృతి డాన్స్ ఐతే వేరే లెవెల్. వీళ్ళ డాన్స్ కి గణేష్ మాష్టర్ ఫిదా ఇపోయారు. ఐతే ఈ అన్ని జోడీస్ లో +5 స్కోర్ గెలుచుకునే జోడి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఐతే ఇన్ని ఎపిసోడ్స్ నుంచి సాగర్ - శృతి డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక నెక్స్ట్ వీక్ వీళ్ళు "ముక్కాలా మూకాబులా" అంటూ ప్రభుదేవా డాన్స్ కి క్లాసిక్ టచ్ ఇచ్చి మరీ డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. క్లాసికల్ కాస్ట్యూమ్ తో చేసిన ఈ డాన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. మరీ ముఖ్యంగా గణేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే "మన ఢీ షో నుంచి మరో సాయి పల్లవి రాబోతోంది." అంటూ చెప్పారు. ఇంకా "మీకు ఒక మంచి సినిమా అవకాశం రావాలండి" అని కూడా ఆమెతో అనేసరికి శృతి కూడా ఫుల్ ఖుషీ ఐపోయింది.

ఈ కామెంట్స్ ఎవరైనా రైటర్స్, డైరెక్టర్స్ వింటే గనక కచ్చితంగా ఈమెతో సినిమా తీసే అవకాశం కూడా లేకపోలేదు. ఇక పులి యాట్టం డాన్స్ ఫార్మ్ లో "అదిగో అదిగో మేక" సాంగ్ కి జతిన్ చేసిన డాన్స్ కి వినయ్ బిన్నీ, గణేష్ మాస్టర్ ఇద్దరూ ఖుషీ ఐపోయి కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు. అలాగే మిగతా జోడీస్ ఐతే బాంగ్రా, ట్యాపింగ్, పులి యాట్టం, కాంటెంపరరీ, కథాకళి వంటి డాన్స్ ఫార్మ్స్ తో డాన్స్ చేసి అందరినీ అలరించారు. ఐతే గణేష్ మాష్టర్ సాయి పల్లవి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు అంటే ఢీ సీజన్ 4 లేడీస్ స్పెషల్ అప్పట్లో టెలికాస్ట్ అయ్యింది. అందులో సాయి పల్లవి కూడా డాన్స్ కంటెస్టెంట్ గా వచ్చింది. ఆ సీజన్ కి యాంకర్ గా ఉదయ భాను, జడ్జెస్ గా రంభ, బృంద మాష్టర్, సంగీత ఉన్నారు. ఈ ఢీ షో తర్వాత సాయి పల్లవి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ, అమరన్ లాంటి హిట్ మూవీస్ చేసింది..

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.