English | Telugu

ఢీ 14లో జడ్జెస్ ముద్దుల వర్షం!

ఢీ14 దుమ్ము రేపే డాన్స్ షో ప్రతీ వారం అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్స్ తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు ఈ షో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయబోతోంది. అందులో ఆది మొదట నామినేషన్ వేస్తారు. హోస్ట్ ప్రదీప్.. ఆది వాళ్ళ పార్టీ పేరు, గుర్తు అడిగేసరికి "వేస్తె వెయ్ లేదంటే హై " అనేది పార్టీ పేరు, మైక్ పార్టీ గుర్తు అంటూ డబుల్ మీనింగ్ ఉన్న ఒక కుళ్ళు డైలాగ్ పేలుస్తాడు. ఇక అలాగే రవికృష్ణని ప్రదీప్ అడుగుతాడు. ప్రెసిడెంట్ గా మీరు గెలిస్తే ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు అని. "జెంట్స్ కి ఎవరికైనా హగ్ కావాలంటే మాత్రం మేం ప్రొవైడ్ చేస్తామంటూ " అతనొక కుళ్ళు జోక్ వేస్తాడు.

'ఇంతకు రవికృష్ణ ఏ యాంగిల్ లో ప్రెసిడెంటు' అంటూ ఆది కౌంటర్ వేస్తాడు. 'మా పార్టీకే ఓటు వేయండి' అని ఎవరికివాళ్ళు ప్రాంప్ట్ చేసుకుంటూ ఉంటారు. జూన్ 15 న ప్రసారమయ్యే ఢీ-14 కుళ్లిపోయిన డైలాగ్స్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . నెటిజన్స్ మాత్రం ఈ స్టేజి మీద డాన్స్ పెరఫార్మెర్స్ కి విషెస్ చెప్పారు. ఇక ప్రసాద్ తన డాన్స్ తో అందరినీ మెప్పించేసరికి ప్రియమణి, నందిత శ్వేతా ఇద్దరూ కలిసి చెరో బుగ్గపై ముద్దులు వర్షం కురిపించేసారు. ఈ సీన్ చూడడానికి కాస్త ఎబ్బెట్టుగా కూడా ఉంది. 'ఇలా ముద్దులు పెట్టి ఓవర్ యాక్షన్ చేయకండి. బాగుంటే మెచ్చుకోండి చాలు' అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.