English | Telugu

ప్రదీప్ జీవితంలో ఆ రోజు మర్చిపోలేనిది!

ఢీ-14 డ్యాన్సింగ్ ఐకాన్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో ఎన్నో అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు కంటెస్టెంట్స్. ఈ షోలో ఎన్నో లవ్ స్టోరీస్ ని చెప్పారు. ఇక ప్రదీప్ ఆ రోజు నాకు చాలా చాలా మెమరబుల్ నాకు , ది మోస్ట్ బ్యూటిఫుల్ డే హాజ్ కమ్..నాకెప్పటికీ గుర్తుండిపోయే రోజు అంటూ చెప్పేసరికి అందరూ ఎవరు వారు ? అది ఏ రోజు ? అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసరికి ప్రదీప్ కాస్త సిగ్గుపడినట్టు కనిపించింది. తర్వాత అఖిల్ వచ్చి తన లవ్ స్టోరీ చెప్తాడు. తాను 10th చదివేటప్పుడు ఆ అమ్మాయి 6th చదువుతోందట. తర్వాత ఆది వచ్చి తన క్యూట్ లవ్ స్టోరీ చెప్తాడు. 8th క్లాస్ వరకు తన ఊళ్ళోనే గవర్నమెంట్ బళ్ళో చదువుకున్నాడట. 9th క్లాస్ కి ప్రైవేట్ స్కూల్ కి మారాడట.

అప్పుడొచ్చిందయ్యా ఆ స్కూల్ కి ఒక అమ్మాయి..తన క్లాస్ ఐపోయి కింద వచ్చేసరికి ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ వస్తోందట. రెండేళ్ల తర్వాత ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూసినప్పుడు బాబోయ్ ఆ ఫీలింగ్ నేను చెప్పలేను అంటూ ఆది తెగ సిగ్గుపడిపోయాడు . ప్రదీప్ వచ్చి హార్ట్ బెలూన్ ఇస్తాడు ఆదికి. తర్వాత నయనిపావని లవ్ స్టోరీ చెప్తుంది ఇక ఆది నయనిని సర్ప్రైజ్ చేయడానికి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని పిలిచానని చెప్తాడు. అలా వాళ్ళ వాళ్ళ క్యూట్ లవ్ స్టోరీస్ తో ఈ రాబోయే వారం షో అలరించబోతోంది.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.