English | Telugu

రోజురోజుకి దగ్గరవుతున్న రిషి, వసుధార.. షాక్ లో దేవయాని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -738 లో.. ధరణి ఆపిల్ ముక్కలు తీసుకొని రిషి దగ్గరికి వస్తుంది. మళ్ళీ వసుధార కూడా ఏం తినలేదు కదా అని ఆలోచించిన రిషి.. ఆ అపిల్ ముక్కలని వసుధార దగ్గరికి తీసుకొని వస్తాడు. అప్పుడే వసుధారతో దేవయాని మాట్లాడుతుంది. ఏంటి మెడలో ఏం లేకుండా తిరుగుతున్నావ్.. ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తావ్ అని వసుధారని దేవయాని అడుగుతుంది. నేను సమాధానం చెప్తాను మేడమ్.. మీరు దాని గురించి ఏం దిగులు పడొద్దంటూ వసుధార సమాధానమిస్తుంది. ఆ తర్వాత వసుధారకి ప్రేమగా ఆపిల్ ముక్కలు తినిపిస్తాడు రిషి. ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటారు. అది చూసిన దేవయాని వీళ్లిద్దరిని ఎలాగైనా విడదీయాలని అనుకుంటుంది. కాసేపటికి సర్ నాకు నిద్ర రావడం లేదని వసుధార అంటుంది. మన ప్రేమని గుర్తు చేసుకుంటూ నిద్రపోమని, గుడ్ నైట్ చెపుతాడు రిషి. మనమిద్దరం పక్కపక్కనే ఉండి ఎప్పుడు గుడ్ నైట్ చెప్పుకుంటామో.. ఆరోజు త్వరగా రావాలని కోరుకుందామని రిషి అంటాడు. సరేనని వసుధార అంటుంది.

మరుసటి రోజు ఉదయం అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. రిషి వచ్చి పెద్దమ్మ పిలిచారట అని అడుగుతాడు. అవును రిషి నీతో మాట్లాడాలని దేవయాని అంటుంది. ఇంటి పెద్దగా బాధ్యత తెలిసిన దానిని కాబట్టి మీ పెళ్లి త్వరగా చేయాలని అనుకుంటున్నానని దేవయాని అంటుంది. జగతి, మహేంద్ర మీరిద్దరు కలిసి పిల్ల తల్లి తండ్రులను తీసుకొని వస్తే మాట్లాడుకొని పెళ్లి చేద్దామని దేవయాని అంటుంది. మా ఫ్యామిలీ అంటే వాళ్ళు ఇప్పుడు సమస్యల్లో ఉన్నారని జగతితో అంటుంది వసుధార. మీరు మీరు మాట్లాడుకోవడం కాదు మాకు చెప్పండని దేవయాని అనగానే.. వాళ్ళ వాళ్ళు సమస్యల్లో ఉన్నారట అని జగతి అనగానే పిలిపించండి సమస్యలు లేని వారు ఎవరుంటారని దేవయాని అంటుంది. ఎవరూ వారిని రమ్మని పిలవాల్సిన పని లేదు పెద్దమ్మ.. వసుధర నేను ఒకరికొకరం ఇష్టపడ్డాం.. పెళ్లి చేసుకోవాలనుకున్నాం.. మధ్యలో చిన్న చిన్న అపార్థలు అంతే.‌. ఈ శూన్యమాసం అయిపోయాక మీరే మంచి రోజు ఫిక్స్ చెయ్యండంటూ రిషి చెప్పగానే.. వసుధార, జగతి, మహేంద్రలు హ్యాపీగా ఫీల్ అవుతారు. దేవయాని మాత్రం బిత్తరపోయి చూస్తుంది.

రిషి అన్న మాటలకు వసుధార ఎమోషనల్ అవుతూ ధరణిని హత్తుకుని మిమ్మల్ని అక్క అని పిలవాలని ఉంది మేడం అని అంటుంది. పిలవమని ధరణి అంటుంది. పిలిచే హక్కు ఇంకా రాలేదని అంటుంది వసుధార. త్వరలోనే మీ పెళ్లి అయిపోతుంది మీరు హ్యాపీ‌.. మనందరం హ్యాపీ అని ధరణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.