English | Telugu

దీప్తికి కౌంటర్.. నాకు లవ్ మీమ్స్ పంపించొద్దంటున్న షణ్ముఖ్!

సోషల్ మీడియా ద్వారా యూత్ కి బాగా దగ్గరై, ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ లలో బాగా రాణించి బిగ్ బాస్ లో అవకాశం తెచ్చుకుంది. బిగ్ బాస్ ఎంట్రీతో సెలెబ్రిటీగా మారిన దీప్తి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. మరోవైపు దీప్తి, షణ్ముఖ్ కలిసి పలు షార్ట్ ఫిల్మ్ లలో నటించి బాగా క్లోజ్ అయి ఆ తర్వాత లవర్స్ గా మారారు. అయితే గత సీజన్ అయినటువంటి బిగ్ బాస్ సీజన్ -5 లో షణ్ముఖ్ ఎంట్రీ ఇచ్చాడు. అదే సీజన్-5 కి సిరి హనుమంత్ కూడా రావడం..‌తనతో షణ్ముఖ్ క్లోజ్ గా ఉండటంతో కథ మారింది. బిగ్ బాస్ లోకి వెళ్ళేముందు వరకు షణ్ముఖ్, దీపు వాళ్ళిద్దరి చేతిపై టాటూస్ ఉండేవి. బిగ్ బాస్ పూర్తయ్యాక వారిద్దరు విడిపోయారు. కాగా ప్రస్తుతం‌ ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడటం లేదు.

అసలు విషయానికి వస్తే బిగ్ బాస్-5 లో షణ్ముఖ్, సిరి హన్మంత్ లు బాగా క్లోజ్ గా ఉన్నారనే విషయం అందరికి తెలిసిందే. ఫ్యామిలీ వీక్ లోనే అటు షణ్ముఖ్ మదర్, ఇటు సిరి మదర్ వచ్చి.‌. అంత క్లోజ్ గా ఉండొద్దంటూ చెప్పుకొచ్చారు. కానీ వాళ్ళు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అదే ధోరణిని కనబరిచారు. ఇక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కొన్ని రోజులకు షణ్ముఖ్, దీపు విడిపోయారు. అది కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది. దాంతో అప్పట్లోనే షణ్ముఖ్, సిరి తో క్లోజ్ గా ఉండడం వల్లే వాళ్ళు విడిపోయారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అప్పటి నుండి ఇద్దరు ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడుపుతున్నారు. మరోవైపు ఒకరి సోషల్ మీడియా పోస్ట్ లకు మరొకరు ఇండైరెక్ట్ గా కౌంటర్ లు వేస్తూ వస్తున్నారు.

కొన్నిరోజుల క్రితం దీప్తి సునైన.. నువ్వు ఎంత కూల్ గా ఉంటే అంత బాగుంటావ్ అని తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసింది. దాని తరవాత కొన్ని గంటల వ్యవధిలోనే.. "కూల్ బేబీ" అంటూ షణ్ముఖ్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసాడు. అయితే తాజాగా దీప్తి సునైన ఒక పోస్ట్ ని షేర్ చేసింది.. "జీవితంలో ఏది ఏమైనా రోజు ముగిసే సమయానికి మనం హ్యాపీగా, స్ట్రెస్ లేకుండా ఉండాలని చెప్పి, మరోక పోస్ట్ లో " If you are see this.. Drink ABC Juice..హెల్త్ ముఖ్యం బిగిలు " అని పోస్ట్ ని షేర్ చేసింది దీప్తి. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే దానికి కౌంటర్ వేసాడు షణ్ముఖ్. తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేసాడు.. ABC జ్యూస్ ప్యాక్ ని కిందపడేసి కాలుతో తన్నే ఒక వీడియోని షేర్ చేసాడు. ఆ వీడియోకి.. "డోంట్ సెండ్ లవ్ మీమ్స్" అంటూ పోస్ట్ చేసాడు. ఇలా ఒకరు చేసిన పోస్ట్ కి మరొకరు ఇండైరెక్ట్ గా రిప్లై ఇచ్చుకుంటున్నారు ఇద్దరు. ఇంతకీ షణ్ముఖ్ పోస్ట్ చేసిన.. డోంట్ సెండ్ మీ లవ్ మీమ్స్ అనే పోస్ట్ దీప్తి సునైనకేనా తెలియాల్సి ఉంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.