Read more!

English | Telugu

అతడిని చూసి పొరపడిన వసుధార.. ధరణి కన్నీటి పర్యంతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్  గురువారం నాటి ఎపిసోడ్ -748 లో.. శైలేంద్ర దగ్గరికి ధరణి కాఫీ తీసుకొని వెళ్ళినట్టుగా అతను ప్రేమగా కాఫీ బాగుందని చెప్పినట్టుగా కల కంటుంది ధరణి. నిజానికి కాఫీ తెచ్చిన ధరణిపై కోప్పడతాడు శైలేంద్ర. ఎలా ఉన్నావ్.. ఇంట్లో అద్దం ఉంది కదా ఎప్పుడైనా చూసుకున్నావా? కాఫీ  మాత్రమే బాగుంది.. నువ్వు అస్సలు నచ్చలేదు.. నాకు ఇలా ఉంటే నచ్చదని శైలేంద్ర అంటాడు. అప్పుడే అక్కడికి దేవయాని వచ్చి.‌ నేను కూడా అదే చెప్తాను.. అసలు వినదంటూ ఇంకా గొడవ పెట్టాలని చూస్తుంది. ధరణి కళ్ళ నిండా నీళ్లతో బాధని అణుచుకొని కిందకి వెళ్ళిపోతుంది. అలా ధరణి బాధపడుతూ కన్నీటితో రావడం జగతి, మహేంద్రలు గమనిస్తారు. 

ఆ తర్వాత వసుధార ఇంటికి వస్తుంది. వసుధార వచ్చేటప్పుడు దారిలో ఏం జరిగిందో, తను ఏం చేసిందో.. అదంతా రిషి, జగతి, మహేంద్రలకు చెప్తుంది. అలాంటి పొగరుబోతుని నేనెప్పుడూ చూడలేదని చెప్తుంటే.. అప్పుడే మేడపై నుండి శైలేంద్ర, దేవయాని ఇద్దరు వస్తారు.  వసుధారని చూసిన శైలేంద్ర షాక్ అవుతాడు..అలాగే వసుధార అతన్ని చూసి షాక్ అవుతుంది. అదిగో తనే వసుధార.. అని శైలేంద్రకి పరిచయం చేస్తుంది దేవయాని. తను మా అన్నయ్య అని రిషి పరిచయం చేస్తాడు. హేయ్ వసుధార నువ్వేనా.. నీ గురించేనా మా అమ్మ రోజు చెప్పేదని శైలేంద్ర పరిచయం ఉన్నట్లే మాట్లాడేసరికి.. ఏంటి అన్నయ్య మీకు తను ముందే పరిచయం ఉందా అని అడుగుతాడు. నేను వస్తుంటే ఒక గొడవ ద్వారా పరిచయం అయిందని చెప్తాడు.. ఆ గొడవ కి పోలీస్ లు కేసులు అంటూ నానా హంగామా చేసింది.. చాలా ధైర్యవంతురాలని అర్థమయిందని శైలేంద్ర అంటాడు.  అన్నయ్య అన్ని మర్చిపోయి మాములుగా మాట్లాడుతుంటే.. నువ్వేం మాట్లాడవేంటని రిషి అంటాడు.  సారీ మీరని తెలియక అలా మాట్లాడానని వసుధార అంటుంది. ఆ తర్వాత జగతికి వసుధార జరిగిందంతా చెప్తుంది. కొన్ని విషయాలు మార్చిపోతేనే  మంచిదని వసుధారతో జగతి అంటుంది. 

ఆ తర్వాత వసుధార పరధ్యానంలో ఆలోచిస్తూ నడుస్తుంటే పడబోతుంది.. అప్పుడే రిషి తనని పట్టుకుంటాడు.. ఏంటీ అంతగా ఆలోచిస్తున్నావని రిషి అడుగుతాడు. నేను మనుషులిని అంచనా వెయ్యడంలో పొరపడ్డానా? నేను ఎప్పుడు కరెక్ట్ గానే అంచనా వేస్తానని వసుధార అంటుంది. ఒక్కోసారి మన అంచనా తప్పు అయిండొచ్చని రిషి అంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం ధరణిని డల్ గా ఎందుకు ఉన్నావని జగతి అడుగుతుంది. అక్కడే వసుధార కూడా ఉంటుంది. అప్పుడే దేవయాని వచ్చి.. అబ్బాయిని భోజనంకి పీల్చుకొని రా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.