English | Telugu

అమ్మ కోసం ఒక నెక్లెస్ కొన్న దీపికా


దీపికా రంగరాజు అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఎవరికీ తెలీదు కానీ "బ్రహ్మముడి" సీరియల్ లో కావ్య అంటే చాలు బొమ్మలకు రంగులేసే అమ్మాయిగా యిట్టె గుర్తోచేస్తుంది. తమిళనాడు చెన్నైలో పెరిగిన దీపికా న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. తమిళ్ మూవీ "ఆరడి"లో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత తమిళ సీరియల్ 'చితిరం పెసుతడి' తో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్ గా వస్తున్న బ్రహ్మముడి సీరియల్ లో ఇప్పుడు ఈమె నటిస్తోంది. ఇక ఈ సీరియల్ టాప్ 1 పొజిషన్ లో రేటింగ్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దీపికా తన యుట్యూబ్ ఛానల్ లో ఒక వీడియో అప్ లోడ్ చేసింది. వాళ్ళ అమ్మ కోసం గోల్డ్ కొని సర్ప్రైజ్ చేసింది. ఐతే చెన్నై ఫస్ట్ హోమ్ అని హైదరాబాద్ సెకండ్ హోమ్ ఐపోయింది అని చెప్పింది.

ఇప్పుడు సీరియల్ కి ఎక్కువగా రెమ్యూనరేషన్ వస్తోంది కాబట్టి మా అమ్మా నాన్న కొంత డబ్బు సేవ్ చేయమని చెప్తూ ఉంటారు. గోల్డ్, ల్యాండ్ మీద డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని చెప్పారు. ఎప్పుడూ నేను అమ్మానాన్నతోనే జ్యువెలరీ షాపింగ్ చేసాను కానీ ఇప్పుడు నేను మాత్రమే వచ్చాను అని చెప్పింది. ఇక దీపికా దేవుడిని ఒక తీరని కోరిక కోరేసుకుంది..."వచ్చే జన్మలో కూడా నాకు నా డాడీనే రావాలి..అప్పుడు నా డాడీ జ్యువెలరీ షాప్ ఓనర్ గా ఉండాలి " అని కోరుకుంది. గోల్డ్ వేసుకుని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి..లేదంటే ఎవరైనా దొంగ వచ్చి లాక్కుపోతాడు అని చెప్పింది. అలా అన్ని రకాల డిజైన్స్ చూసి చివరికి ఒక నెక్లెస్ తీసుకుని వెళ్ళింది కావ్య.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.