English | Telugu

దేవయానికి విశ్వరూపం చూపించిన చక్రపాణి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్‌-693 లో.. వసుధారకి టైం ఇవ్వకుండా సడన్ గా మీటింగ్ కి పిలుస్తాడు రిషి. అందరూ మీటింగ్ కి వచ్చాక వసుధారని మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడమంటాడు. అలా హఠాత్తుగా చెప్పమనేసరికి వసుధారకి ఏం మాట్లాడాలో తెలియక అటుఇటు చూస్తు‌ంటుంది.

అలా వసుధార అటుఇటు చూడటం చూసి రిషి మెసేజ్ చేస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ టాపిక్ అని చెప్తాడు. వసుధార ఆ మెసేజ్ చూసి రిషి సర్ ఏంటి మెసేజ్ చేసాడని చూస్తుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి టాపిక్ కి సంబంధించిన అన్ని వివరాలను మెసేజ్ ల రూపంలో వసుధారకి పంపిస్తాడు రిషి. తను ఆ మెసేజ్ లు అన్నీ చూస్తు సెమినార్ బాగా ఇస్తుంది. మీటింగ్ పూర్తయ్యాక అందరూ చప్పట్లతో తమ అభినందనలని తెలుపుతారు. వసుధారని పర్సనల్ గా కలుస్తుంది జగతి. చాలా బాగా మాట్లాడావ్ అని చెప్పగా.. ఆ క్రెడిట్ మీ కొడుకుకే దక్కాలని వసుధార అంటుంది. అదేంటి అని అడుగుతుంది రేవతి. రిషి సర్ టాపిక్ గురించి మెసేజ్ ల రూపంలో పంపించాడని చెప్తుంది. ఆ తర్వాత రిషి, వసుధార కలిసి కాలేజ్ నుండి ఇంటికి బయల్దేరతారు

చక్రపాణి ఇంటికి దేవయాణి వస్తుంది. వసుధారని మా రిషి మీదకి ఎందుకు ఉసిగొలుపుతున్నావని అంటుంది. దానికి ఒక్కసారిగా రెచ్చిపోతాడు చక్రపాణి. "ఏం మాట్లాడుతున్నావ్, మాటలు మంచిగా రానివ్వు.. నేను మారిపోయాను.. పాత చక్రపాణిని నిద్రలేపకు తట్టుకోలేవు.. నా విశ్వరూపం చూసి తట్టుకోలేవ్" అని చక్రపాణి కోపంతో ఊగిపోతుంటాడు. అతడిని చూసి.‌. "వీడేంటి ఇంతలా కోపంతో ఊగిపోతున్నాడు" అని దేవయాని తన మనసులో భయపడిపోతుంది. కాసేపటికి రిషి వచ్చి పెద్దమ్మా అని అనగానే చక్రపాణి, దేవయాని మౌనంగా ఉండిపోతారు. ఆ తర్వాత దేవయానిని రిషి తీసుకెళ్తాడు. కాసేపటికి చక్రపాణిని ఏం అయిందని వసుధార అడుగగా.‌. "తను ఒక ప్రశ్న అడిగితే నేను నాలుగు సమాధానాలు చెప్పాను" అని చక్రపాణి చెప్తాడు. కార్ లో దేవయాని రిషి వెళ్తుండగా వసుధార థాంక్స్ అని మెసేజ్ చేస్తుంది. అలా ఇద్దరు కాసేపు చాటింగ్ చేసుకుంటారు. "ఫోన్ లో ఎవరు" అని దేవయాని అడుగగా.. "వసుధార పెద్దమ్మా.. మా ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఉండటం నాకిష్టం లేదు.. నా సమస్యని నేనే పరిష్కారించుకుంటాను" అని రిషి చెప్పగా దేవయాని మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.