English | Telugu

హగ్ మీ టైట్ అని ఎవరితోనో చెప్తోన్న అష్షు

బుల్లితెర మీద తన హాట్ పిక్స్ తో అందరినీ తన వైపు తిప్పుకునే బిగ్ బాస్ బ్యూటీ అషు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈమె సోషల్ మీడియాలో తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫుల్ మస్తీ చేస్తూ ఉంటుంది. ఎవరేమనుకున్నా పెద్దగా పట్టించుకోదు అష్షు. తనకు నచ్చిందే చేస్తుంది..ఏది అనిపిస్తే అదే పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాగే తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. "హగ్ మీ టైట్...ఐ నీడ్ విటమిన్ యు" " నా విషయంలో ఈ విటమిన్ "యూ" లోపం ఎప్పుడూ ఉంటుంది" అని పోస్ట్ చేసింది. మరి ఈ కాప్షన్ ఎవరి కోసం పెట్టిందో మాత్రం అష్షు చెప్పలేదు.

అష్షు కామెంట్స్ పెట్టడమే కాదు, వీడియోస్ , ఫోటోషూట్స్ లో కనిపించడం మాత్రమే కాదు మంచి వంటగత్తె అని కూడా నిరూపించుకుంది. తన ఫ్రెండ్స్ కోసం మంచి స్పైసీగా ఉండే చికెన్ కర్రీని వండేసింది. బాగోకపోతే ఏమంటారో తెలీదు కానీ బాగుంటుందని గట్టి నమ్మకం అంది అష్షు. ఇక అరియనా, అష్షు రాంగోపాల్ వర్మ కలిశారు అంటే మాత్రం మీడియాకి మంచి స్టఫ్ దొరికినట్టే. పవన్ కళ్యాణ్ కు వీరాబాభిమాని అయిన అష్షు పవన్ పేరును తన ప్రైవేట్ పార్ట్ పై టాటూగా వేయించుకుని సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉన్న అష్షు మరో వైపు సినిమా ఛాన్స్ లు సైతం దక్కించుకుంటూ దూసుకుపోతోంది.