English | Telugu
ఇన్‌స్టాగ్రామ్‌లోకి 'దేవత' ఫేమ్ రుక్మిణి.. చిన్నప్పటి ఫొటోతో సందడి!
Updated : Oct 6, 2022
'దేవత' సీరియల్ తో ఫుల్ ఫేమస్ ఐన రుక్మిణి.. అదే మన సుహాసిని ఎట్టకేలకు దసరా పండగ రోజున ఇన్స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టింది. 'దేవత' సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ ఐన నటి సుహాసిని. ఇన్స్టాగ్రామ్ పేజీలో ముందుగా స్కూల్ యూనిఫామ్ లో ఉన్న చిన్నప్పటి ఫోటో ఒకటి పోస్ట్ చేసి "చిన్నతనంలో దిగిన ఫొటోస్ నుంచే స్టార్ట్ చేయనివ్వండి" అంటూ కాప్షన్ పెట్టింది.
సుహాసినికి సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో చాలామంది ఫాలోయర్స్ ఉన్నారు. తన సహనటులంతా కూడా సుహాసినికి ఇన్స్టాగ్రామ్ లోకి స్వాగతం పలికారు. 'చంటిగాడు' మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సుహాసిని. అలాగే 'లక్ష్మీ కళ్యాణం', 'అడ్డా', 'దోస్త్'.. ఇలా దాదాపు30 సినిమాల్లో నటించింది. అలాగే ఈమె తమిళం, కన్నడంలోనూ కొన్ని మూవీస్ లో యాక్ట్ చేసింది.
జెమినీలో వచ్చిన 'అపరంజి' సీరియల్ తో బుల్లి తెర మీద అడుగుపెట్టిన సుహాసిని తర్వాత అనుబంధాలు, అష్టాచమ్మా, గిరిజా కళ్యాణం, ఇద్దరు అమ్మాయిలు సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం 'దేవత' సీరియల్ లో లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తోంది.