English | Telugu

విడాకులు కోరిన స్టెల్లా..గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలంటూ కండిషన్

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ చాలా కొత్తగా డిజైన్ చేశారు మేకర్స్. రావడం రావడమే విడాకుల అంశం మీద ఫోకస్ చేశారు యాదమ్మ రాజు-స్టెల్లా జంట. "ఫోన్ చూపించు నీది" అని రాజుని అడిగింది స్టెల్లా..."ఏంటి పాస్వర్డ్ పెట్టావ్..నేను యూఎస్ కి వెళ్లే ముందు సెల్ కి పాస్వర్డ్ లేదు...కానీ ఇప్పుడు పాస్వర్డ్ పెట్టావ్..నువ్వు తప్పు చేస్తున్నావ్..నాకు విడాకులు కావాలి" అని స్టెల్లా అనేసరికి తనకు కూడా విడాకులు కావాలని సెల్ ని కిందకి విసిరేసాడు రాజు. " పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసుకున్నావో విడాకులు కూడా అంతే గ్రాండ్ గా కావాలి" అని అడిగింది స్టెల్లా...ఇలా ఈ వారం షో విడాకుల టాపిక్ మీద రాబోతోందని అర్ధమవుతోంది.

తర్వాత ఈ షోలో చాలామంది సీరియల్స్ లో చేసిన సీనియర్ కపుల్స్ వచ్చారు. వీళ్లకు గులాబ్ జామున్ ఒకరికి ఒకరు తినిపించుకునే పోటీ పెట్టారు. తర్వాత బైక్ డ్రైవింగ్ పోటీలు పెట్టారు. ఇక చాలా రోజుల తర్వాత ఈ షోకి హైలైట్ గా సింగర్ బేబీ నిలిచారు ఈమె టాలెంట్ గురించి తెలిసి రఘు కుంచె పాటలు పాడే అవకాశాన్ని ఇచ్చారు. ఇలా ఈమె బాగా ఫేమస్ అయ్యారు. ఈ షోలో ఆమె పాడిన "ప్రేమ ఓ ప్రేమ" అనే సాంగ్ కి ఇంద్రజ ఫిదా ఇపోయారు. అలాగే ఒక జాబ్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే ఒక వర్కింగ్ లేడీని ఈ షోలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆమె కూడా డాన్స్ ఇరగదీసి వేసేసింది. ఇక ఫైనల్ గా ప్రెగ్నెంట్ గా ఉన్న లహరిని లేడీస్ అంతా కలిసి వెళ్లి తీసుకొచ్చి సీమంతం లాంటి చిన్న వేడుకను చేశారు. "ప్రతీ అమ్మాయికి ఇదొక మెమరబుల్ మూమెంట్...అలాంటి మూమెంట్ ని ఇంత స్పెషల్ గా అందించిన శ్రీదేవి డ్రామా కంపెనీకి బిగ్ థ్యాంక్స్" అని చెప్పింది లహరి. ఇలా నెక్స్ట్ సండే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది ఈ షో. ఐతే ఈ షోలో హైపర్ ఆది మాత్రం ఈ వారం కనిపించలేదు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.