Read more!

English | Telugu

బ్రేకప్ తర్వాత రోబోట్ లా మారాననిపిస్తోంది!

దీప్తి సునైనను బిగ్ బాస్ కి ముందు ఆ తర్వాత గనక చూస్తే అప్పట్లో వెబ్ సిరీస్ చేస్తూ పాపులారిటీ లేకుండా ఉండేది కానీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చాక ఫుల్ ఫేమస్ ఐపోయింది. ఇక ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫాన్స్ తో టచ్ లోనే ఉంటోంది. రీసెంట్ గా దీప్తిని ఫాన్స్ కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి దీప్తి కూడా చాలా చురుకైన సమాధానాలే చెప్పింది. ఐతే దీప్తి, షణ్ముఖ్ విడిపోయిన విషయం తెలిసిందే. 

ఈ విషయం గురించి ఒక నెటిజన్ కొంటెగా ఒక ప్రశ్న అడిగాడు. "లవ్ బ్రేకప్ తర్వాత నీలో నువ్వు కనిపెట్టిన చేంజ్ ఏమిటి"? అని అడిగేసరికి "రోబోట్ ఐపోతున్నా అనిపిస్తోంది" అని రిప్లై ఇచ్చింది. ఇక జీన్ ఫాంట్ టి షర్ట్ లో పడుకుని కూర్చుని రకరకాల ఫోజుల్లో పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. వీటికి కాప్షన్ వెరైటీ గా పెట్టింది "పదాలకు అందని స్వరం ఇక్కడొకటుంది..వినండి" అంది. దీప్తి వేసుకున్న టీ షర్ట్ మీద కామెంట్స్ వచ్చాయి. "ఈ టీ షర్ట్ ని ఎక్కడో చూసినట్టు ఉందే... షన్ను దగ్గర చూసినట్టు ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు. 

దీంతో దీప్తి వేసుకున్న టి షర్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.. `లోపల బాధ పెట్టుకుని బయటికి నవ్వుకుంటూ ఉంటున్నావ్‌ కదా`, `నీ కళ్లలో ఏదో తెలియని పెయిన్‌ కనిపిస్తోంది" అంటూ బాధపడ్డారు కొంత మంది నెటిజన్స్. కెరీర్ పరంగా ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళు ఉన్నారు దీప్తి-షన్ను.