English | Telugu

దీప్తి సునైన పోస్ట్ చేసిన ఆ వీడియో అతడిని ఉద్దేశించేనా!

దీప్తి సునైనా.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ లోకి వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. దీప్తి సునైన షణ్ముఖ్ జస్వంత్ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసి సన్నిహితంగా మారి లవ్ లో పడిపోయారు. ఎటు చూసిన సోషల్ మీడియాలో షణ్ముఖ్, దీప్తి సునైనల జంటనే కన్పిస్తుంది.

షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనకి దీప్తి సపోర్ట్ బాగా ఉండేది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక షన్ను, దీప్తి సునైనా ఇద్దరు విడిపోయారు. వాళ్ళు విడిపోవడానికి కారణం బిగ్ బాస్ హౌస్‌లో షణ్ముఖ్ ఉన్నప్పుడు.. సిరితో క్లోజ్ గా ఉండడం వల్లనే.. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యిందని అప్పట్లో ఆ న్యూస్ వైరల్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. షణ్ముఖ్, దీప్తి సునైన ఇద్దరు విడిపోయి.. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. అయితే రెండు మూడు సందర్బాలలో ఈవెంట్స్ లో ఎదురుపడినా పరిచయం లేనట్లుగా ఉన్నారు. కాగా ఇద్దరు ఒకరి గురించి మరొకరు ఇండైరెక్ట్ గా తమ ఇన్ స్టాగ్రామ్ పేజీలలో మాట్లాడుకుంటున్నారు. అంటే సెటైరికల్ గా ఒకరి పోస్ట్ కి మరొకరు కౌంటర్లు వేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు.

దీప్తి సునైన లవ్ బ్రేక్ అఫ్ అయినప్పటి నుండి తన పరిధిలో తాను ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని గడుపుతుంది. తనకి సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తన ఫాన్స్ కి దగ్గరగా ఉంటుంది దీప్తి సునైన. కాగా తాజాగా ఒక వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దీప్తి. నేను కొన్ని నెలల నుంచి ప్రతి దానికి చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నాను.. అసలు ఏమవుతుందో నాకు అర్ధం కావట్లేదు. ఆ పాజిటివ్ గా ఆలోచిస్తున్నందుకు మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.

సాడ్ గా ఉండటం.. వి డోంట్ క్రై.. వి డోంట్ ఫీల్ బ్యాడ్.. మీ గురించి కాదు నా గురించి చెప్తున్నాను. నన్ను ఏదీ ఎఫెక్ట్ చేయలేదు. అసలు మా ఫ్రెండ్స్ ఇలా చేస్తుంటే.. ఫీల్ అవట్లేదా అని నన్ను అంటున్నారు.‌. ఇలా చెప్తూ ఒక వీడియోని షేర్ చేసింది దీప్తి. ఒక ఫిల్టర్ ఆడ్ చేసి డాన్స్ చేసి వీడియో పోస్ట్ చేసింది. నాకంటే ఎక్కువ ఆ ఫిల్టర్ నే డాన్స్ చేసింది. ఆ ఫిల్టర్ కూడా నాతో ఉండట్లేదని మరొక వీడియో పోస్ట్ చేసింది దీప్తి సునైన.

అయితే దీప్తి సునైన షేర్ చేసిన ఈ వీడియో షణ్ముఖ్ ని ఉద్దేశించి పోస్ట్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే వీరిద్దరి లవ్ కి ఫ్యాన్స్ గా ఉన్న కొన్ని ఫ్యాన్ పేజ్ ల వాళ్ళు వీరిద్దరిని ఇలా ఉండటం చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. షణ్ముఖ్, దీప్తి సునైనల మధ్య సాగుతున్న ఈ కోల్డ్ డ్రామా ఇంకెక్కడి దాకా వెళ్తుందో చూడాలి మరి. అయితే ఇప్పుడు ఈ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. దీప్తి సునైన పోస్ట్ చేసిన ఈ వీడియోకి షణ్ముఖ్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.