English | Telugu

‘సిందూరం’ మూవీకి బాగా లాస్ వచ్చింది...త్రివిక్రమ్ కరెక్ట్ డెసిషన్ చెప్తాడు!

సిక్స్త్ సెన్స్ గేమ్ షోకి వచ్చే గెస్టులను ఓంకార్ ఆడించడమే కాదు వాళ్ళ నుంచి చాలా విషయాలను కూడా రాబడుతూ ఉంటాడు. అలా ఈ వారం షోకి వచ్చిన రష్మీ, బ్రహ్మాజీని ఆలాగే చాలా ప్రశ్నలు అడిగాడు. "ఇండస్ట్రీలో ఇన్నేళ్లు సక్సెస్ ఫుల్ గా ఉన్నారు మీరు..అలాంటి ఈ జర్నీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు" అని ఓంకార్ బ్రహ్మజీని అడిగాడు. "కృష్ణవంశీ. ఆయన నేను ఇండస్ట్రీకి ఒకేసారి వచ్చాం. అప్పట్లో అతను చాల స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన సింధూరం మూవీని మమ్మల్ని పెట్టి తీసాడు. బిజినెస్ తక్కువ జరుగుద్ది అని తెలిసినా బెస్ట్ క్వాలిటీ కోసం అంత కంటే ఎక్కువ పెట్టి తీసాడు. ఐతే ఆ సినిమాకి బాగా లాస్ వచ్చింది.

అదే చాలా పెయిన్ ఫుల్ సిట్యుయేషన్.నేను అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనతోనే ఉన్నా " అని చెప్పాడు బ్రహ్మాజీ. " మీ ఫేవరేట్ డైరెక్టర్ ఎవరు అని అడిగాడు" "త్రివిక్రమ్ శ్రీనివాస్. నాకు ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్ ఉన్నా ఆయనతో ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఆయన కరెక్ట్ డెసిషన్ చెప్తాడు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఇలా అన్ని చెప్తాడు" అని చెప్పాడు. "మీ ఫేవరేట్ హీరో ఎవరు" అని అడిగేసరికి "చిరంజీవిగారు" అని చెప్పాడు. "ఫేవరేట్ హీరోయిన్ ఎవరంటే ఇష్టం" అనేసరికి "టబు" అని చెప్పాడు. మరి మీకు ఏ హీరో, హీరోయిన్ అంటే ఇష్టం అని రష్మిని అడిగేసరికి "ప్రభాస్, అనుష్క అంటే ఇష్టం" అని చెప్పింది రష్మీ. తర్వాత లాస్ట్ రౌండ్ లో బ్రహ్మాజీ, రష్మీ గేమ్ ఆది మరో లక్ష రూపాయలు గెలుచుకున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.