English | Telugu

లైవ్ లో ఏడ్చిన దీప్తి సునైనా.. షణ్ముఖ్ హార్ట్ బ్రేక్!

ఐదేళ్ల తమ ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునైనా, షణ్ముఖ్ జ‌స్వంత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇకపై ఎవరి దారులు వాళ్లు చూసుకుంటామని.. ఎవరి కెరీర్‌పై వాళ్లు దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే తాము విడిపోతున్నట్లు ఇటీవల దీప్తి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని స్వాగతిస్తూ పోస్ట్ పెట్టాడు. నిర్ణ‌యం తీసుకునే హ‌క్కు దీప్తికి ఉంద‌ని చెప్పాడు. ఆమె చాలా క‌ష్టాలు ప‌డింద‌నీ, ఆమె సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నానని తెలిపాడు.

దీప్తి, షణ్ముఖ్ బ్రేకప్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన దీప్తి.. బ్రేకప్‌ గురించి స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. బ్రేకప్‌ గురించి ఓ నెటిజన్‌ దీప్తిని ప్రశ్నించగా.. జీవితంలో ఎప్పటికీ ఇలాగే ఉండాలని లేదని.. కెరీర్‌పరంగా ఏదైనా సాధించాలనుకుంటున్నానని.. ఇప్పటి వరకూ నా గురించి నేను ఆలోచించుకోలేదని.. అలాగే నా కెరీర్‌ని కూడా పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోవాలనుకుంటున్నానని.. కెరీర్‌లో రాణించాలనుకుంటున్నానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ దీప్తి కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మరోవైపు షణ్ముఖ్ సైతం తాజాగా ఇన్‌స్టాలో డల్ గా ఉన్న తన ఫొటోని షేర్ చేసి.. హృదయం ముక్కలైన ఎమోజీలను ఎటాచ్ చేయడం గమనార్హం.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.