English | Telugu

మానస్ గురించి దీపిక కామెంట్స్.. డైరెక్టరే తన ఎనర్జీ అంట!

దీపిక రంగరాజు ఈ పేరు తెలియకపోవచ్చు కానీ బ్రహ్మముడి కావ్య అని అంటే అందరు ఇట్టే గుర్తుపడతారు. బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు రాష్ట్రాలలో ప్రతీ ఇంట్లో ఒక అమ్మాయిలా మారిపోయింది దీపిక‌ అలియాస్ కావ్య. తెలుగు అమ్మాయి కాకపోయిన తెలుగుతనం ఉట్టి పడేలా ఉంటుంది కావ్య. 'బ్రహ్మముడి' లో పాపులర్ ఉన్న పాత్ర కావ్యది. తన రీల్ లైఫ్ లో ఎలా పద్దతి గా ఉంటుందో రియల్ లైఫ్ లో కూడా అంతే పద్ధతిగా అణుకువగా ఉంటుంది దీపిక.

బ్రహ్మముడి సీరియల్ లో కావ్య -రాజ్ ల జంట బుల్లితెరపై సంచలనం సృష్టిస్తుంది. కావ్య ఒకవైపు అత్తింటి గౌరవం, మరొకవైపు పుట్టింటి బరువు, భాద్యతలు చేపడుతూ అందరికి చేరువవుతుంది. మొదట రాజ్ కి ఇష్టం లేకుండా కావ్యని పెళ్ళి చేసుకుంటాడు రాజ్. అయితే ఇప్పుడిప్పుడే కావ్యకి దగ్గరవుతున్నాడు. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో అనామికకి లవ్ ప్రపోక్ చేయమని కళ్యాణ్ కి చెప్పి వాళ్ళిద్దరిని ఒక్కటి చేసింది కావ్య.

వినాయకుని విగ్రహాలు తీసుకొచ్చి కృష్ణమూర్తి పరువు కాపాడాడు రాజ్. ఇక అప్పు తన మనసులో కళ్యాణ్ మీద ఉన్న ఫీలింగ్స్ ని బయటపెట్టట్లేదు. ఇలాంటి టైమ్ లో స్వప్న ప్రెగ్నెంట్ అని మర్చిపోయి డ్యాన్స్ చేస్తే తనకి బుద్ది చెప్పింది కావ్య. అయితే రాజ్ రాసిన చీటీని చదివిన కావ్య ఆశ్చర్యపోతుంది. ఇలాంటి ట్విస్ట్ లతో ఈ సీరియల్ ఫుల్ ఎంగేజ్ అవుతుంది. అయితే ఇందులో కావ్య ప్రధాన పాత్రలో దీపిక ఆకట్టుకుంటుంది.

కొన్ని నెలల క్రితం యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది దీపిక అలియాస్ కావ్య. రోజుకొక సర్ ప్రైజ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో‌ కూడా యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా తను 'ఆస్క్ మి సంథింగ్' స్టార్ట్ చేసింది. ఇందులో నెటిజన్లు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పింది దీపిక. మీరు పుట్టింది ఎక్కడ అని ఒకరు అడుగగా.. చెన్నైలోని టీనగర్ అని చెప్పింది దీపిక. మీరు తమిళ్ అయిన తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు ఎలా అని ఒకరు అడుగగా.. నా బ్లడ్ లోనే తెలుగు ఉంది అని దీపిక అంది. మీ ఫేవరెట్ నటీనటులు ఎవరని అడుగగా..

బ్రహ్మముడి సీరియల్ లోని కావ్య-రాజ్ అని దీపిక అంది. మానస్ గురించి చెప్పండి అనగా.. మానస్ గారు జెమ్, ఇంటలిజెంట్ అండ్ వెరీ సపోర్టివ్ అని అంది. డైరెక్టర్ కుమార్ పంతం గురించి చెప్పండి అని ఒకరు అడుగగా.. అతనే నా బూస్ట్. పొద్దున్నే షూట్ కి వచ్చిననుండి అయిపోయేవరకు వెరీ యాక్టివ్, పుల్ ఎనర్జీ ఇస్తాడు. ఇంక చాలా వరకు అందరికి సపోర్ట్ గా ఉంటాడు. అతను ఒక పెద్ద పవర్ స్టేషన్ అని దీపిక అంది. ఇలా దీపిక తన ఇన్ స్టాగ్రామ్ లో సరదాగా కొన్ని విషయాలని పంచుకుంది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.