English | Telugu
`కార్తీక దీపం`: అసలు నిజం తెలుసుకున్న దీప
Updated : Jan 6, 2022
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీక దీపం. గత కొన్ని వారాలుగా ఆసక్తిగా సాగుతున్న ఈ సీరియల్ గురువారం మరో మలుపు తిరగబోతోంది. రుద్రాణి కుట్రలో ఇరుక్కుపోయిన డాక్టర్ బాబు ఆ కుట్ర నుంచి బయటపడటానికి మదన పడుతుంటాడు. కానీ దారి తెలియక ఏం చేయాలో అర్థం కాక తనలో తానే కుమిలిపోతుంటాడు. ఈ నేపథ్యంలో ఈ గురువారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది. ఈ రోజు 1242వ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Also Read: దీపకు నిజం చెప్పేసిన కార్తీక్!
రుద్రాణికి ఆవేశంలో ఇచ్చిన మాట గురించి తెలుసుకుని కార్తీక్ లోలోన మదన పడుతుంటాడు. దీప కనిపెట్టి ఆరా తీస్తుంది. సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేయడంతో దీప ఒట్టుపెట్టించుకుని అసలు విషయం ఏంటో చెప్పమని కార్తీక్ ని నిలదీస్తుంది. దీంతో తను చేసిన పొరపాటుని చెప్పేస్తాడు. రుద్రాణి రెచ్చగొట్టడంతో ఆవేశంలో సంతకం చేశానని, కానీ తరువాత తనకు ఇష్టమొచ్చింది తాను రాసుకుందని చెబుతాడు.
Also read:షన్ను, దీప్తి ఇలా.. సిరి, శ్రీహాన్ అలా..
"ఏంటీ మీరు సంతకం పెడితే తాను నా కూతురుని తీసుకెళ్లిపోతుందా? ఏంటీదీ డాక్టర్ బాబు? అంతా మీ ఇష్టమేనా?" అని కార్తీక్ ని నిలదీస్తుంది. "ఏంటీ దేవుడా నాకీ పరీక్షా ఇంకా నామీద కోపం పోలేదా?" అంటూ దీప బోరున విలపిస్తుంది. హిమ నా కూతురు అని తెలిసినా ఆ విషయం చెప్పలేక తల్లడిల్లానని అలాంటిది ఇప్పుడు నా పిల్లలని నా నుంచి రుద్రాణి దూరం చేస్తుందా? .. నా పిల్లలపై రుద్రాణి కన్ను పడిందా? అని కార్తీక్ ని నిలదీస్తుంది దీప. దీంతో సమాధనం చెప్పలేక బయటికి వెళ్లిపోతాడు కార్తీక్. ఆ తరువాత ఏం జరిగింది? .. రుద్రాణి రియాక్షన్ ఏంటీ? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.