English | Telugu

ఫుడ్ డెలివ‌రీ బాయ్‌గా మారిన డాన్స్ షో కంటెస్టెంట్‌.. అంత‌లోనే యాక్సిడెంట్‌!

హిందీ బుల్లితెరపై 'డాన్స్ ఇండియా డాన్స్' షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ షోలో న్యాయనిర్ణేతలుగా అప్పుడప్పుడు బాలీవుడ్ స్టార్స్ కూడా కనిపిస్తుంటారు. అయితే ఈ షో లో కంటెస్టెంట్ గా పాల్గొన్న బికీ దాస్ రోడ్డు ప్రమాదానికి గుర‌య్యాడు. గత శుక్రవారం బైక్ మీద వెళ్తున్న బికీ దాస్ మరో బైక్ ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అతడి పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బికీ దాస్ ను హాస్పిటల్ లో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మీద బికీ దాస్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా.. బికీ దాస్ 2014లో ప్రసారమైన 'డాన్స్ ఇండియా డాన్స్' నాల్గో సీజన్ లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించాడు. తన డాన్స్ స్టెప్పులతో చాలా మందికి ఫేవరెట్ గా మారాడు. ఫైనల్స్ లో మాత్రం రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ షో తరువాత అతడి సినిమాల్లో అవకాశాలు రాకాపోవడంతో.. పలు ఈవెంట్స్ చేసుకుంటూ, కొన్ని షోలలో మెంటర్ గా కనిపిస్తూ జీవనం సాగించాడు. కరోనా కారణంగా అతడికి ఉపాధి లేకుండా పోయింది. దీంతో వారం క్రితమే ఆయన ఫుడ్ డెలివెరీ బాయ్ గా జాయిన్ అయ్యాడు. కోల్‌కతాలో ఫుడ్ డెలివర్ చేస్తోన్న సమయంలో అతడికి యాక్సిడెంట్ జరిగింది. మరి ఇప్పటికైనా సినీ పెద్దలెవరైనా బికీ దాస్ కు సాయం అందిస్తారేమో చూడాలి!

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.