English | Telugu

ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ మీద నేనేం చెప్తాను!

"కామెడీ స్టాక్ ఎక్స్చేంజి" ఎపిసోడ్ 2 ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఇక చైర్మన్ అనిల్ రావిపూడి వస్తూనే తన వైఫ్ తో గొడవ పెట్టుకుని మరీ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని హోస్ట్ సుధీర్ మీద చూపించాడు. ఇక లేడీ హోస్ట్ దీపికా పిల్లి మాత్రం చైర్మన్ ని కూల్ చేసి షో స్టార్ట్ చేయించింది.

ఇక ఫస్ట్ రౌండ్ "అట్లుంటది మనతోని" లో ఫామిలీ రిలేషన్ షిప్స్ గురించిన స్కిట్స్ పెర్ఫార్మ్ చేశారు స్టాక్స్...ఫస్ట్ కంటెస్టెంట్ గా హరి వచ్చి ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని కామెడీ పంచ్ డైలాగ్స్ తో చేసి చూపించాడు. ఇక సెకండ్ కంటెస్టెంట్ గా అవినాష్ వచ్చి "నైట్ ఐతే వేస్తాం లైటు, ఈరోజు నా కంటెంటు ఫస్ట్ నైటు" అని చెప్పి పల్లెటూళ్ళో ఫస్ట్ నైట్ రోజు ఎవరు, ఎంత హడావిడి చేస్తారో ఆ మొత్తాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు.

ఇక స్కిట్ ఐపోయాక చైర్మన్ అనిల్ రావిపూడి నవ్వుకుంటూ తన సెల్ చూసుకుంటుండగా హోస్ట్ సుధీర్ ఆయన్ని పిలిచాడు. "హా..ఏంటమ్మా ..నన్ను ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ చెప్పమంటావా ఏమిటి..అవినాష్ చేసాడు..బాగుంది...దీని మీద కూడా పేరాగ్రాఫు నేనెక్కడ చెప్పగలను" అని కౌంటర్ వేశారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.