English | Telugu

జీ తెలుగులో 9 నుంచి కొత్త సీరియల్ 'చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి'

బుల్లితెర మీద న్యూ ఇయర్ లో అలరించడానికి కొత్త కొత్త సీరియల్స్ రెడీ అవుతున్నాయి. జీ తెలుగులో కొత్తగా ఒక డైలీ సీరియల్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆ సీరియల్ పేరు 'చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి'..ఇందులో హీరో హీరోయిన్స్ గా మహి గౌతమి- రాఘవేంద్ర కనిపించనున్నారు. ఈ సీరియల్ జనవరి 9 నుంచి మధ్యాహ్నం 2 . 30 కి ప్రసారం కాబోతోంది. ఆ దైవ నిర్ణయానికి, మానవ సంకల్పానికి మధ్య జరిగే ఒక యుద్ధం..చివరికి ఇందులో ఎవరు గెలుస్తున్నారు ? అనే థీమ్ తో ఈ కొత్త సీరియల్ "చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి" ఆడియన్స్ మనసును దోచుకోవడానికి సిద్దమయ్యింది.

ఈ సీరియల్ కథ మొత్తం భాగ్యలక్ష్మి అనే అమ్మాయి జీవితం చుట్టూ తిరుగుతుంది. స్వార్థం లేని ఒక అమ్మాయి. ఇతరులకు సాయపడుతూ ఉండే ఒక ఇన్నోసెంట్ అమ్మాయి. ఎప్పుడూ తన చుట్టూ ఉన్నవాళ్లను సంతోషంగా ఉండేలా చూసుకుంటూ ఉంటుంది. మరో వైపు మిత్ర నందన్ ఒక మంచి బిజినెస్ మాన్..అతను ఎలాంటి పరిస్థితినైనా యిట్టె సాల్వ్ చేసుకునే ఒక తెలివైన వ్యక్తి. తన డెస్టినీని తాను మార్చేసుకోగలననే ధీమాతో ఉంటాడు. కానీ అతనికి తల్లి అంటే ఇష్టం.. ఆమె మాటకు ఎప్పుడూ నో అని చెప్పనే చెప్పాడు. అనుకోని పరిస్థితుల్లో భాగ్యలక్ష్మి, మిత్ర పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అప్పటినుంచి తన జీవితం మొత్తం మారిపోయిందని బాధపడుతూ ఉంటుంది. కానీ కొంతకాలానికి మిత్రాను అర్ధం చేసుకుంటుంది.

అప్పుడు అతను ఆమెకు ప్రేమను పంచుతాడా ? మిత్ర జీవితంలో ఎదురయ్యే సంఘటనలను భాగ్యలక్ష్మి ఎలా ఫేస్ చేస్తుంది..తన బంధాన్ని ఎలా నిలుపుకుంటుంది, కుటుంబాన్ని ఎలా కాపాడుతుంది అనేదే మిగిలిన కథాంశం. మహి గౌతమి "నీవల్లే నీవల్లే" అనే సీరియల్ తో తెలుగు బుల్లితెరకు పరిచయమై "రంగుల రాట్నం" "అగ్నిపరీక్ష" సీరియల్ లో నటించి మెప్పించింది. ఇక ఈమె ఆర్జేగా, యాంకర్ గా కూడా చేసింది. ఇక ఈమె అసలు పేరు మహాలక్ష్మి. మరి ఈ సీరియల్ లో తన నటన ఎలా ఉండబోతోందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.