English | Telugu

చందు గౌడ ఇంట్లో సంబరాలు!

బుల్లి తెర నటుడు చందూ గౌడ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను 'త్రినయని' సీరియల్ ద్వారా మంచి ఫేమస్ ఐన యాక్టర్. యాక్ట్యువల్ గా చందు గౌడ కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటుడు. అక్కడ 'లక్ష్మి బారామ్మా' అనే సీరియల్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. 2020 లోనే ఇతను షాలిని అనే మోడల్‌ను పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. చందూ పుట్టుకతోనే శ్రీమంతుడు. అతని తండ్రి బైరప్ప బెంగళూర్‌లో బిగ్ బిజినెస్ మాగ్నెట్స్ లో ఒకరు. ఇక ఇప్పుడు చందు గౌడ తాను తండ్రినయ్యానంటూ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ సందర్భంగా చందూగౌడ, ఆయన భార్య షాలిని ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది.

మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఈ జంటకు ఆడపిల్ల పుట్టింది. చందు, షాలిని వాళ్ళ చిన్ని పాపను చాలా సంతోషంతో స్వాగతించారు. తనకు ఒక ఆడపిల్ల పుట్టిందని ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్నాడు చందూ. తనకు అన్నీ ఉన్నా.. ప్రత్యేకమైన గుర్తింపులేదనే బాధే త‌న‌ని నటుడ్ని చేసిందంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు, ఇప్పుడు మూవీస్ లో నటించడానికి సిద్దమౌతున్నట్టు తెలుస్తోంది చందు గౌడ. ఇక కూతురు పుట్టిందన్న విషయం తెలుసుకున్న చందు గౌడ ఫ్రెండ్స్ ఫామిలీ మెంబెర్స్ , నెటిజన్స్ అంతా అతన్ని అభినందిస్తూ విషెస్ చెప్తున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.