English | Telugu

బిగ్ బాస్ కి మోహన భోగరాజు?

బిగ్ బాస్ సీజన్ 6 కి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక ఈ సీజన్ కి సంబంధించి హౌస్ లోకి వెళ్లే వాళ్ళ లిస్ట్ ఇది..కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా సింగర్ మోహన భోగరాజు పేరు బాగా వినిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో తప్పనిసరిగా సింగర్ కంటెస్టెంట్స్, జర్నలిస్ట్ కంటెస్టెంట్స్ తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటారు.

" బుల్లెట్ బండెక్కి వచ్చేత్తావా" అనే పాట ద్వారా ఎంతో ఫేమస్ ఐన సింగర్ మోహన భోగరాజు హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ ఐతే ఇండస్ట్రీలో నడుస్తోంది. కాకపొతే ఈమె డైరెక్ట్ గా ఎంట్రీ ఇస్తుందా లేదంటే వైల్డ్ కార్డు ద్వారా వస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 ఎమోషనల్ ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ ఆదిరెడ్డి, గీతా రాయల్, ఉదయభాను, శ్రీహాన్, సుదీప, టాలీవుడ్ హీరో సుమంత్ అశ్విన్, బుల్లితెర నటుడు అమర్ దీప్ వంటి కొందరి పేర్లు వినపడుతున్నాయి.

అలాగే సామాన్యుడికి కూడా ఈ షోలో అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్ మేకర్స్. ఇక ఈ షో వచ్చే నెల 4 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు అనౌన్స్ చేశారు. హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారు అనే అంశంపై ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి. మరి ఎవరి ఎంట్రీ ఏమిటి ఎలా అని తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.