English | Telugu

ఛాన్స్ చిక్కింది.. ష‌న్నుపై స‌న్నీ పంచ్ పేలింది

బుధ‌వారం బిగ్‌బాస్ ఎపిసోడ్ ఫుల్ ఫ‌న్ మోడ్‌లో సాగింది. అయితే ఈ ఫ‌న్‌లోనూ స‌న్నీ త‌న పంచ్‌ల‌కి ప‌ని పెట్టాడు. ఏకంగా ష‌న్నుని పులిహోర‌గాడిగా అంద‌రి ముందు నిరూపించేశాడు. బుధ‌వారం జ‌రిగిన 94వ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఇంటి స‌భ్యుల‌కు `రోల్ ప్లే` ఫ‌న్నీ టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా హౌజ్ నుంచి ఎఇలిమినేట్ అయిన ప్రియాంక‌, లోబో, జెస్సీల‌తో పాటు ఇంటిలో వున్న స‌భ్యుల‌ని కూడా మ‌రొక‌రు అనుక‌రించాల్సి వుంటుంది.

ఇందులో భాగంగా ‘రోల్‌ప్లే’ అనే ఫన్నీటాస్క్‌ను ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ప్రియాంక, లోబో, జెస్సీలు ఎలా ప్రవరిస్తారో హౌజ్‌లో ఉన్న వారిని చేసి చూపించారు. ఇందులో భాగంగా మానస్‌ .. ప్రియాంకలా మారాడు. శ్రీరామ్‌ లోబోలా మారి రచ్చ రచ్చ చేశాడు. అలాగే షణ్ముఖ్‌ జెస్సీ అవతారమెత్తగా, సన్నీ మానస్‌లా మారిపోయాడు. ఇలా ఒక్కొక్కరు తమ పాత్రలను మరొకరిలా మార్చుకొని సందడి చేశారు.

ఇదే టాస్క్ తో షన్నుగా స‌న్నీ.. సిరిగా ష‌న్ను క‌నిపించారు. అయితే ఇలాంటి అదును కోస‌మే చూస్తున్న స‌న్నీ సిరి, ష‌న్నుల‌ని ఓ ఆట ఆడుకున్నాడు. ష‌న్ను పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన స‌న్నీ సిరి పాత్ర‌లో వున్న ష‌న్నుని న‌లిపేస్తూ `నేను చ‌పాతిగాడ్ని.. పులిహోర గాడ్నీ అంటూ ష‌న్నుని బ‌క‌రాని చేసేశాడు. దీంతో ఏదో అనుకుంటో మ‌రేదో అయిపోతోంద‌ని గ‌మ‌నించిన సిరి ఆ సీన్‌లో అన్ని హ‌గ్గ‌లు లేవురా అని .. ఇక ఆప‌రా అంటూ అరిచేసింది. ష‌న్ను అయితే మ‌రీ ఓవ‌ర్‌గా లేదూ అని ఫీలైపోయాడు. మొత్తానికి స‌న్నీ చేసిన ఫ‌న్నీ కామెడీ ష‌న్ను, సిరిల‌కు బిగ్ ఝ‌ల‌క్ ఇచ్చేసింది. ఈ ఎపిసోడ్ చూసిన వారంతా ఛాన్స్ చిక్కింది.. ష‌న్నుపై స‌న్నీ పంచ్ పేలింది అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.