English | Telugu

బాలయ్య షోలో కాస్టింగ్ కౌచ్‌ టాపిక్! 

కాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లకు ఛాన్స్ ఇచ్చినందుకుగాను హీరోయిన్ల తో శారీర‌క సుఖాన్ని ఆశించి అందుకు ఒప్పించ‌డం. అయితే కొంద‌రు బ‌ల‌వంతంగా కూడా ఇలాంటి ప‌నులు చేస్తార‌ని అంటారు.ఇదే కాస్టింగ్ కౌచ్ అనబడుతుంది. ఇది ఆడవారు మగవారు.. అందరిలోనూ ఏదో ఒక రూపంలో ఉంటుంది. మగవారైతే డబ్బు.. ఆడవారైతే శరీరం అప్పగించాల్సి వస్తుంది. ఇక తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ కార్యక్రమంలో భాగంగా అలనాటి ఎవ‌ర్‌గ్రీన్ హీరోయిన్ల‌యిన జ‌య‌సుధ‌, జయప్రదల‌ తో కలిసి ఓ ఎపిసోడ్ చేశాడు. ఈ ఎపిసోడ్ కు నేటి హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఒక అతిథిగా హాజరైంది.

ముందుగా ఆయన రాశి ఖ‌న్నా తో మాట్లాడుతూ నువ్వు నటించిన హీరోలలో నీకు ఎవరి మీద క్రష్ ఉంది... అని అడుగ‌గా రాశి ఖన్నా సెకండ్ కూడా ఆలోచించకుండా విజయ్ దేవరకొండ పేరు చెబుతుంది. వీళ్లిద్దరూ కలిసి గతంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే అట్టర్ ఫ్లాప్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో రాశిఖ‌న్నా విజయ్ దేవరకొండ తో రెచ్చిపోయి మరి రొమాన్స్ చేసింది. ఇక బాలయ్య మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోయిన్గా నిలదొక్కుకోవాలి అంటే కచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిందేనా అని అడుగుతాడు. అలాంటిది ఏమీ వుండదు.. మన దగ్గర ట్యాలెంట్ వుంటే ఇండస్ట్రీ‌ లో ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా మనము ముందుకుపోవచ్చు... ప్రేక్షకులు కూడా అలానే ఆదరిస్తారు అని ఆ ప్రశ్నకి జయసుధ, జయప్రద, రాశి ఖన్నా ముగ్గురు కూడా సమాధానం చెప్పారు. మొత్తానికి ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది.