English | Telugu

మా అమ్మలా చూసుకుంటావ్ అని లవ్ ప్రొపోజ్ చేసిన ఆసియా!

ఆసియా-నూకరాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వీళ్ళు లవ్ ప్రొపోజ్ చేసుకున్నారు. "నువ్వు మా అమ్మ తర్వాత అమ్మలా చూసుకుంటావ్..ఆమెలానే అప్పుడే కోప్పడతావ్ అప్పుడే మళ్ళీ నన్ను ఓదారుస్తావ్. మా అమ్మలానే నేను ఎలా ఉండాలో చెప్తావ్.

నేను నిన్ను ఇష్టపడుతున్నాని ఎలా చెప్పాలో తెలియడం లేదు..ఐ లవ్ యు రాజు..నేను నిన్ను నమ్ముతున్నాను..లైఫ్ లాంగ్ ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుతావని అనుకుంటున్నాను..నేను ఇంతకుముందు ప్రామిస్ చేసినట్టు నీ చేతిని ఎప్పుడూ వదిలిపెట్టను" అని చెప్పింది ఆసియా. తనకు అందరి ముందు ఐ లవ్ యు అని ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం నచ్చదు అని అంది.

ఇక నూకరాజు కూడా "నీ నమ్మకాన్ని నిలబెడతాను, నీ గోల్స్ నువ్ రీచ్ అయ్యేలా చేస్తాను. ఐ లవ్ యు టూ" అని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు నూకరాజు.