English | Telugu
'లైగర్'ని తెగ ట్రోల్ చేసిన బుల్లెట్ భాస్కర్!
Updated : Sep 11, 2022
'లైగర్' సినిమా పోయినా ఆయన చేసిన కామెంట్స్ మాత్రం అలాగే ఉన్నాయి. విజయ్ దేవరకొండకి ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. 'లైగర్' రిలీజ్ కు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసినా ఫైనల్గా బోల్తా కొట్టింది. ఐతే ఈ మూవీ ప్రమోషన్స్ టైంలో విజయ్ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ ని ఒక రేంజ్ లో వాడేస్తున్నారు జబర్దస్త్ కమెడియన్స్.
లేటెస్ట్ ఎపిసోడ్ లో విజయ్ మాటలను రిపీట్ చేస్తూ ఒక స్కిట్ చేశారు. "అరేయ్ ఏందిరా ఈ క్రేజ్.. మా తాత తెల్వదు, మా నాన్న తెల్వదు, ఎవ్వడు తెల్వదు.. అయినా ఇంత ప్రేమ ఇస్తున్నరు" అని విజయ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కామెంట్స్ నే ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో బులెట్ భాస్కర్ రిపీట్ చేసాడు.
"మా అయ్య ఆర్టిస్టు కాదు.. మా తాత ఆర్టిస్టు కాదు.. నేను ఆర్టిస్టు కాదు.. ఏంది ఈ క్రేజ్" అనే డైలాగ్ భాస్కర్ చెప్పడం నిజంగా ఫన్నీగా ఉంది. ఇక విజయ్ నటించిన సినిమా పోయింది అనే కాన్సెప్ట్ లో భాస్కర్ 'దొబ్బుద్ది' అనే సినిమా పేరుతో చేసిన స్పూఫ్ స్కిట్ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇంకోవైపు ఆర్టిస్టు వర్ష అనన్య పాండేలా స్పీచ్ ఇవ్వడం, ఆడియన్స్ లో ఉన్న ఇమ్మానుయేల్ పంచులు పేల్చడం భలే ఫన్నీగా ఉంది. ఈ వారం ఇలా రౌడీ హీరోని జబర్దస్త్ లో ట్రోల్ చేసేసారు బులెట్ భాస్కర్ టీమ్.