English | Telugu

అత్యధిక వీక్షకాదరణ పొందుతున్న బ్రహ్మముడి సీరియల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మ ముడి'. ఈ సీరియల్ రోజురోజుకి ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ప్రస్తుతం ఈ సీరియల్ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ టీఆర్పీలో మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఈ సీరియల్ లోని కథ అంతా దుగ్గిరాల కుటుంబం, కనకం-కృష్ణమూర్తిల కుటుంబం మధ్య జరుగుతూ ఉంటుంది.

కనకం-కృష్ణమూర్తిల కుటుంబం సాధారణ మధ్యతరగతి కుటుంబం. వీరికి ముగ్గురు కూతుళ్ళు. మొదటి కూతురు స్వప్న, రెండవ కూతురు కావ్య, మూడవ కూతురు అప్పు. కృష్ణమూర్తి బొమ్మలకు రంగులేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తాడు. కృష్ణమూర్తి భార్య కనకం ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. కనకం తన కూతుళ్ళని బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి కోడళ్ళుగా పంపించాలని ఎప్పుడు కలలు కంటూ ఉంటుంది. అయితే కనకం లాగే తన మొదటి కూతురు స్వప్న.. బాగా మేకప్ వేసుకొని ఎప్పుడు అందంగా రెడీ అవుతూ, బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్ళాలని కలలు కంటూ ఉండేది. కావ్య మాత్రం ఎప్పుడు కుటుంబానికి ఆసరా ఉంటూ బొమ్మలకు రంగులు వేసుకుంటూ ఉంటుంది. మూడవ కూతురు అప్పు.. చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తుంటుంది. అప్పు సంపాదించుకున్న డబ్బులతోనే తనకి కావలసినవి కొనుక్కుంటూ కుటుంబం మీద భారం పడకుండా చూసుకుంటుంది. ఇక దుగ్గిరాల కుటుంబం బాగా ధనవంతులు. ఉమ్మడి కుటుంబం. సీతారామయ్య దంపతులకు సుభాష్, ప్రకాశ్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. సుభాష్ కి రాజ్, కళ్యాణ్ కొడుకులుగా ఉన్నారు. అయితే వీరిలో రాజ్ కి కొత్తగా పెళ్ళి అయింది.

కనకం వాళ్ళ కూతురి స్వప్నతో రాజ్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అంతా బాగుందన్న టైంలో రాజ్ మేనత్త కొడుకు రాహుల్ వచ్చి తన మాయమాటలతో స్వప్న మనసుని మార్చి ప్రేమలో పడేలా చేస్తాడు‌. రాజ్ కన్నా రాహుల్ ధనవంతుడు అని భావించిన స్వప్న.. పెళ్ళిపీటల నుండి లేచిపోయింది. దీంతో కనకం ఉరివేసుకోడానికి ప్రయత్నించగా.. కావ్య వెళ్ళి ఆపుతుంది. ఆ తర్వాత రాజ్ మేనత్త రుద్రాణి వచ్చి వెళ్ళిపోయిన స్వప్నకి బదులు కావ్యని పెళ్ళిపీటల మీద కూర్చోబెడుతుంది. ఆ తర్వాత రాజ్ కావ్యల పెళ్ళి జరుగుతుంది. దుగ్గిరాల ఇంటికి కోడలిగా వెళ్ళిన కావ్యని రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణ ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుతుంది. కావ్యని ఒక స్టోర్ రూంలో ఉంచుతారు. కష్టాలన్ని కావ్యకేనా అన్నట్టుగా సాగుతుండగా.. తాజాగా కథలో సరికొత్త మలుపు తిరిగింది. స్వప్న ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి కనకం వాళ్ళింటికి రాజ్-కావ్యలు రాగా.. ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన రాజ్ అక్కడ ఇబ్బందులు పడుతుంటాడు. దీంతో ఈ సీరియల్ ‌ని చూసేవారి సంఖ్య గతవారం కంటే ఈ వారం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్, అత్యధిక వీక్షకాదరణ పొందుతూ.. టీఆర్పీలో మొదటి స్థానంలో ఉంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.