English | Telugu

వాళ్ళిద్దరిని ఫ్లాష్ బ్యాక్ ఉందా అని అడిగిన ఏంజిల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -807 లో.. విశ్వనాథ్ ఇంటి నుంచి వసుధార వెళ్లిపోవడానికి బ్యాగ్ తో హాల్లో కి వస్తుంది. అలా వచ్చిన వసుధారని చూసిన ఏంజిల్.. ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. ఇంటికి వెళ్తున్నాను.. ఈ రోజు నుండి కాలేజీకి వెళ్ళాలని వసుధార అనగానే.. ఇంకా నీకు పూర్తిగా నయం కాకుండానే వెళ్తావా వద్దని ఏంజిల్ అంటుంది.

ఆ తర్వాత రిషి మధ్యలో కలుగజేసుకొని.. అలా నొప్పితో ఎలా వెళ్తారు. పూర్తిగా తగ్గాక వెళ్ళండని రిషి అనగానే వసుధార మనసులో సంతోషపడుతుంది. ఆ తర్వాత విశ్వనాథ్ వచ్చి.. వసుధారని వెళ్ళొద్దని చెప్తాడు. దాంతో వసుధార అక్కడే ఉండిపోతుంది. మరొక వైపు జగతి, మహేంద్ర, ఫణింద్రలు మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే అక్కడికి శైలేంద్ర వస్తాడు. ఎలాగైనా వాళ్ళని ఇంటికి తీసుకొని రా అని చెప్పిన దేవయాని మాటలు గుర్తు చేసుకొని శైలేంద్ర లోపలికి వస్తాడు.

డాడీ మీరు పిన్ని బాబాయ్ లని తీసుకొని వస్తానని చెప్పి, మీరు కూడా ఇక్కడే ఉండిపోయారు. అక్కడ మమ్మీ ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా అని ఫణింద్రతో శైలేంద్ర అంటాడు. ఇక్కడ వీళ్ళు మిషన్ ఎడ్యుకేషన్ పనులు చూసుకుంటూ ఉంటే.. నేను ఇక్కడే ఉన్నానని ఫణింద్ర అంటాడు. మీరు ముగ్గురు ఇంటికి రండని చేతులు జోడించి శైలేంద్ర చెప్పేసరికి.. వెళ్దాం మహేంద్ర అని ఫణింద్ర అంటాడు. అప్పుడే మహేంద్రకి జగతి మెసేజ్ చేసి ఓకే చెప్పమని చెప్పమని అంటుంది. అలా జగతి చెప్పగానే మహేంద్ర ఓకే చెప్తాడు.

విశ్వనాథ్ ఇంట్లో ఉన్న వసుధార టాబ్లెట్స్ చూసిన రిషి.. తన టాబ్లెట్స్ తన గదిలో ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉన్నాయని ఏంజిల్ ని పిలుస్తాడు. అప్పుడే వసుధార, ఏంజిల్ ఇద్దరు వస్తారు. ఈ టాబ్లెట్స్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి.. ఇప్పుడు టాబ్లెట్ వేసుకునే టైం కదా అని రిషి అనగానే.. "అవును ఆ విషయం ఇక్కడే ఉన్న వసుధారకి నువ్వే చెప్పొచ్చు కదా రిషి. మీరు వచ్చినప్పటి నుండి మీరు మాట్లాడుకోవడం చూళ్ళేదు.. మీకు ఏమైనా ప్రాబ్లమా.. మీకు ముందు ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా" అని ఏంజిల్ అడుగుతుంది.

పరిచయం లేని వాళ్ళతో ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందని రిషి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీ సీనియర్ లెక్చరర్ అని రిజర్వ్ గా ఉంటున్నావా అని వసుధారని ఏంజిల్ అడుగగా.. అవునని వసుధార అంటుంది. రిషి తన టాబ్లెట్స్ వేసుకోమని చెప్పడంతో.. వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు జగతి, మహేంద్ర, ఫణింద్రలను తీసుకొని శైలేంద్ర ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.