English | Telugu

Brahmamudi : బ్రహ్మముడి సీరియల్ లో కీలక మలుపు.. ఆ రేవతి ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -758 లో..... స్వప్నని కాపాడడానికి కావ్య వెళ్తుంది. అప్పుడే రాజ్ ఫోన్ చేసి ఇంకా ఎప్పుడు ఇంటికి వస్తారని అడుగుతాడు. నాకు కొంచెం టైమ్ పడుతుందని కావ్య అనగానే.. ఏంటి కంగారుగా మాట్లాడుతున్నారు.. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పండి అని రాజ్ అడుగుతాడు. అదేం లేదని కావ్య అంటుంది. రాజ్ దగ్గరికి అపర్ణ, ఇందిరాదేవి వస్తారు.

తను ఎదో ప్రాబ్లమ్ లో ఉందని రాజ్ అనగానే.. తనకి ఎప్పుడు ప్రాబ్లమ్ వైఫ్ వైఫై లాగా తిరుగుతుందని ఇందిరాదేవి అంటుంది. మరొకవైపు స్వప్న వెళ్ళిన కార్ దగ్గర కి కావ్య వెళ్లి చూసేసరికి స్వప్న ఉండదు. కావ్యకి ఇంకా టెన్షన్ అవుతుంది. ఆ తర్వాత స్వప్న వెంట రౌడీలు వస్తుంటే తను ఒక దగ్గర దాక్కొని ఉంటుంది. ఒక రౌడీ స్వప్నని చూసి తనని చంపడానికి వస్తుంటే అప్పుడే కావ్య వచ్చి కాపాడుతుంది. స్వప్నని తీసుకొని కావ్య పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంతలో ఒకావిడ స్వప్న, కావ్యలని లోపలికి లాక్కొని డోర్ వేస్తుంది.

ఆ కాపాడిన ఆమె పేరు రేవతి.. మీ వాళ్ళు ఎలా ఉన్నారని కావ్య వాళ్లని రేవతి అడుగుతుంది. మా వాళ్ళు మీకెలా తెలుసని కావ్య అడుగగా.. నాకు తెలుసు అంటూ చెప్తుంది. మీ అత్త అపర్ణ గారు చాలా మంచివారు.. ముక్కు మీద కోపం ఉంటుంది కానీ మంచిదని కావ్యతో రేవతి అంటుంది. రేవతి ఎమోషనల్ గా మాట్లాడుతుంటే.. తనకి దుగ్గిరాల కుటుంబంతో ఏదో సంబంధం ఉందని క్లియర్ గా అర్థమవుతుంది. మరొకవైపు అప్పుకి కావ్య ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.