English | Telugu

Brahmamudi : రాజ్ కి భార్య స్పర్శ తెలిసింది.. డౌట్ పడిన యామిని!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -672 లో..... రాజ్ ని తీసుకొని లండన్ వెళ్తాను.. ఇక్కడుంటే తనవాళ్లు ఎవరైనా చూస్తే మళ్ళీ తనకి గతం గుర్తుకి వచ్చే ప్రమాదం ఉందని తన పేరెంట్స్ తో యామిని చెప్తుంది. ఇన్నిరోజులు మాకు దూరంగా ఉన్నావ్.. ఇప్పుడు కూడా దూరంగా వెళ్తానంటే మేమ్ ఎలా ఒప్పుకుంటామని యామినితో తన పేరెంట్స్ అంటారు. ఇప్పటికే తప్పు చేస్తూ మా నోరు ముయిస్తున్నావంటూ వాళ్ళ నాన్న కఠినంగా మాట్లాడతాడు.

నేను వెళ్తానని యామిని చెప్తుంటే.. అప్పుడే ఏమైందంటూ రాజ్ వస్తాడు. అంత వినేశాడా ఎంటని యామిని టెన్షన్ పడుతుంది. దేని గురించి మాట్లాడుకుంటున్నారని రాజ్ అడుగగా నాకు తెలియదు వాళ్ళిద్దరిని అడుగమని యామిని వాళ్ళ నాన్న అంటాడు. ఏం లేదు బావ.. లండన్ వెళ్లి అక్కడ పెళ్లి చేసుకొని సెటిలవ్వాలని అంటున్నానని రాజ్ తో యామిని అంటుంది. ఇప్పుడే కదా సెట్ అవుతుంది. పెళ్లి ఏంటి వద్దు ఇక్కడే ఉందామని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు రాజ్ తన పక్కన ఉన్నట్లు గాజులు తొడిగినట్లు కావ్య ఉహించుకుంటుంది. అదంతా ఇందిరాదేవి చూస్తుంది. కిందకి వచ్చి కావ్యని చుస్తే బాధేస్తుంది రాజ్ ఉన్నాడని భ్రమలో బ్రతుకుతుందని ఇందిరాదేవి అంటుంది. అవును డాక్టర్ ని పిలిస్తే బెటర్ అని ధాన్యాలక్ష్మి అంటుంటే.. డాక్టర్ తో పాటు పంతులిని కూడా పిలవాలని రుద్రాణి అంటుంది. ఎందుకని ఇందిరాదేవి అడుగుతుంది. రాజ్ కి చెయ్యాలిసిన కార్యక్రమం చెయ్యాలి కదా అని రుద్రాణి అంటుంది. దాంతో అందరు తనపై కోప్పడతారు. కావ్యని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళిన విషయం రాజ్ గుర్తు చేసుకుంటాడు. వెనకాల నుండి యామిని వచ్చి రాజ్ భుజం పై చెయ్ వేస్తుంది. నీ స్పర్శ నాకు తెలిసిన వాళ్ళ స్పర్శలా లేదు ప్రొద్దున ఒక అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళానని చెప్పాను కదా ఆవిడ స్పర్శ నాకు తెలిసినా ఆవిడ స్పర్శ లాగా అనిపించిందని రాజ్ చెప్తాడు. ఎవరై ఉంటారని యామిని అనుకొని.. ఎవరోలే మన ఫ్రెండ్స్ అయి ఉంటారని డైవర్ట్ చేస్తుంది.

ఇక్కడే ఉంటే రాజ్ కి గతం గుర్తుకి వస్తుంది. వెంటనే నేను లండన్ కి తీసుకొని వెళ్ళాలని యామిని అనుకుంటుంది. మరుసటి రోజు ఉదయం రాజ్ కి కర్మకాండ నిర్వహిస్తారు. ఇందిరాదేవి , అపర్ణ ఇద్దరు బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.