English | Telugu

ఫాథర్ సెంటిమెంట్ తో కన్నీళ్లు..సుమంత్ ని దత్తత తీసుకున్న అక్కినేని నాగేశ్వరరావు

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి అనగనగ మూవీ టీమ్ నుంచి హీరో సుమంత్ వచ్చారు. అలాగే ఈ తరం నటుడు ప్రసాద్ బెహరా కూడా వచ్చాడు. ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో కొన్ని స్వీట్ మెమోరీస్ పేరుతో వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసింది రష్మీ. ప్రసాద్ బెహరా కోసం ఒక ప్లాన్ చేసి వాళ్ళ నాన్న ఫోటోని చూపించింది. ఆ ఫోటోని చూసేసరికి ప్రసాద్ కన్నీటిపర్యంతమయ్యాడు. "మీ నాన్నా ఇప్పుడు మీ ముందుకు వస్తే ఎం చెప్పాలనుకుంటున్నారు" అని అడిగింది. "ఉండిపొమ్మని అడుగుతానండి...ప్రతీ అప్లికేషన్ ముందు నాన్న పేరు లేట్ అని రాసేటప్పుడు మా నాన్న ఉంటె బాగుండు అనిపించేది." అని చెప్పేసరికి సుమంత్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తర్వాత భావన వాళ్ళ నాన్న గురించి చెప్పుకొచ్చింది. "ఊహ తెలిసాక నాన్నతో కలిసి అన్ని షేర్ చేసుకుందాం, మాట్లాడదాం అనుకునేసరికి నాన్న లేరు" అంటూ వాళ్ళ నాన్న ఫోటో చూపించింది కన్నీళ్లు పెట్టుకుంటూ. తర్వాత సుమంత్ కూడా తన తండ్రి విషయం చెప్పుకొచ్చాడు.

నిజానికి నాకు ఇద్దరు తండ్రులు ఉన్నారని నేను నమ్ముతాను. నన్ను కన్నతండ్రి సురేంద్ర అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా నాగేశ్వరరావు గారే నా తండ్రి" అంటూ చెప్పాడు. ఇక ఫైనల్ గా సుమంత్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టి 25 ఏళ్ళు ఐన సందర్భంగా ఆయనకు అందరూ కలిసి చిరు సత్కారం చేశారు. ఇక ఫైనల్ గా తండేల్ సీన్ ని రిక్రియేట్ చేశారు ఇమ్ము - వర్ష. ఐతే రష్మీ "వర్షా ఇమ్ముతో ఆల్మోస్ట్ ఇది చివరి పెర్ఫార్మెన్స్ అనుకోవచ్చా" అని అడిగింది. దాంతో వర్ష ఏడుస్తూ "ఇమ్ము ఇక్కడ ఎంతమంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు" అని చెప్పింది. ఇక ఇమ్ము ఐతే తలదించుకునే ఉన్నాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.