English | Telugu

Brahmamudi : కలిసిపోయిన రాజ్, కావ్య.. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -627 లో.... కావ్యని రుద్రాణి తిడుతుంటే చూడలేక రాజ్ నిజం చెప్పాలని ప్రయత్నం చేయగా కావ్య వద్దని ఆపుతుంది. అవసరం ఉండి గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టి పది కోట్లు అప్పు తీసుకున్నానని కావ్య చెప్తుంది.. చూసారా ఎలా చెప్తుందో వదిన.. నీ కొడుకుని డమ్మీని చేసి ఆడిస్తుందని అపర్ణతో రుద్రాణి అంటుంది.

నువ్వు అగు రుద్రాణి, కావ్య ఎందుకు అలా చేసిందో కనుక్కుంటా అని సుభాష్ అంటాడు. ఎందుకు ఇలా చేసావ్ అని కావ్యని సుభాష్ అడుగుతాడు. తాతయ్య గారు ఆస్తులన్నీ నా పేరున రాశారని, అవి తాకట్టు పెడతాను లేదా అమ్ముకుంటాను.. అడిగే అధికారం ఇంట్లో ఎవరికి లేదని కావ్య కఠినంగా మాట్లాడేసరికి అందరు షాక్ అవుతారు. అపర్ణ అయితే ఏకంగా మీ మావయ్యని అలా అంటావా అంటూ కావ్యపై చెయ్ ఎత్తుతుంది. దాంతో సుభాష్ ఆపుతాడు. కావ్య పైకి వెళ్ళాక చూసారా మన వంశాన్ని బ్రష్టు పట్టించడానికి వచ్చిందని రుద్రాణి అంటుంది. గదిలోకి వెళ్ళాక నాపై కోపంగా ఉందా అని రాజ్ ని కావ్య అడుగుతుంది. లేదు మన నిస్సహాయతపై కోపంగా ఉంది. నందగోపాల్ మీద కోపంగా ఉంది అంటూ కావ్యతో పాజిటివ్ గా మాట్లాడతాడు రాజ్. నీ భర్తగా ఇక నువ్వు బాధపడకుండా చూసుకుంటానని రాజ్ అనగానే కావ్య ఎమోషనల్ అవుతూ రాజ్ ని హగ్ చేసుకుంటుంది. మరొకవైపు నిన్ను ఆ అనామిక అలా అంది అంటూ అప్పుతో చెప్తూ కళ్యాణ్ బాధపడతాడు. భోజనం చెయ్యడు. దాంతో నేను కూడా భోజనం చెయ్యను. రేపు వెళ్ళాలి గుర్తుంచుకోమని అప్పు అనగానే కళ్యాణ్ భోజనం చేస్తాడు.

కావ్య తనతో అలా మాట్లాడినందుకు సుభాష్ బాధపడుతుంటాడు. అప్పుడే ప్రకాష్ వచ్చి నాకు అవమానం జరిగితే.. నువ్వు ఉన్నావ్ అనుకున్న కానీ ఈ రోజు నీక్కూడా జరిగిందని ప్రకాష్ అంటాడు. అదంతా కావ్య వింటుంది. తరువాయి భాగంలో అందరూ భోజనం చేస్తుంటారు. అపర్ణ, సుభాష్ లు రాకపోవడంతో ఎలా వస్తారు.. అంత అవమానం జరిగినా తర్వాత అని రుద్రాణి అంటుంది. నందగోపాల్ ని ఎవరు షూట్ చేశారు. వాడు బ్రతికి ఉంటే ఎవరికి నష్టం దీని వెనకాల ఎవరో ఉన్నారని రాజ్ తో కావ్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.