English | Telugu

Brahmamudi : కావ్య గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం చెప్పేసిన ధాన్యలక్ష్మి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -624 లో.....ఇంట్లో ఏం జరుగుతుంది. మీకు వచ్చిన సమస్య గురించి చెప్పమని అపర్ణ అడిగితే కావ్య చెప్పదు. దాంతో అపర్ణ కావ్యతో మాట్లాడడం మానేస్తుంది. కావ్య కాఫీ తీసుకొని వచ్చినా కూడా అపర్ణ తీసుకోదు. అప్పుడే రాజ్ వస్తాడు. మీకు దమ్ముంటే ఈ కాఫీ తీసుకొని వెళ్లి అత్తయ్యకి ఇవ్వండి అని అంటుంది. రాజ్ కాఫీ తీసుకొని అపర్ణ గదిలోకి వెళ్తాడు. కాసేపటికి కాఫీ కప్ పగిలిన సౌండ్ ఇంకా రాజ్ చెంప చెల్లుమనిపించిన సౌండ్ వస్తుంది. ఇక రాజ్ బయటకి వచ్చి ఏదో కవర్ చేస్తాడు. ఈసారి కావ్య వెళ్లి ఇస్తుందని రాజ్ అంటాడు.

రాజ్ ఏదో సౌండ్ వచ్చిందని ఇందిరాదేవి అనగానే రాజ్ డైవర్ట్ చేసీ.. కాఫీ చేస్తున్న కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య, రాజ్ లు కాఫీ తీసుకొని బయట కూర్చొని ఉన్న అపర్ణ దగ్గరికి వచ్చి తన కాళ్ళ మీద పడి.. ఒకరికి మించి ఒకరు వాళ్ళ కవిత్వంతో పోటీపడుతూ అపర్ణని రిక్వెస్ట్ చేసి పైకి చూసేసరికి.. టీ తాగుతూ ఇందిరాదేవి ఉంటుంది. మమ్మీ ఎక్కడ అని రాజ్ అడుగగా.. ఎప్పుడో వెళ్ళిపోయిందని ఇందిరాదేవి చెప్తుంది. దాంతో ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. మరొకవైపు అప్పు, కళ్యాణ్ లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దొంగ సామంత్ పర్సు దొంగతనం చేయబోతుంటాడు. అప్పు చూసి ఆపుతుంది. సామంత్ ని చూసి ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడే అనామిక వచ్చి.. ఏం పని లేక ఇలా దొంగలని పట్టుకుంటున్నారన్నమాట ఎంత తీసుకుంటున్నారు అంటూ తక్కువ చేసి మాట్లాడుతుంది. నా అప్పు త్వరలోనే పోలీస్ కాబోతుందని కళ్యాణ్ చెప్పగానే.. జోక్ బాగుంది అంటూ అనాకిక నవ్వుతుంది. త్వరలోనే అప్పుని పోలీస్ డ్రెస్ లో చూస్తావని కళ్యాణ్ చెప్పి అప్పుని తీసుకొని వెళ్లిపోతాడు. నిజంగానే పోలీస్ అవుతుందా.. ఆ కావ్య, రాజ్ పై పోకస్ చేసి వీళ్ళ గురించి మర్చిపోయానని అనామిక అనుకుంటుంది.

మరోవైపు ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వస్తుంది. కావ్య గెస్ట్ హౌస్ ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకుందన్న విషయం చెప్తూ.. వీళ్ళు ఆస్తులు కాదు అప్పులు వాటాలు ఇచ్చేలా ఉన్నారంటూ రుద్రాణి రెచ్చగొడుతుంది. దాంతో విషయం ఏంటో తేలుస్తానని ధాన్యలక్ష్మి అంటుంది. రాజ్ రెడీ అవుతుంటే.. ఇంకా రెడీ అవ్వలేదా ఎన్ని పనులు చేసి నేను ఎలా రెడీ అయ్యానంటూ రాజ్ కు కావ్య సూట్ తోడిగిస్తూ అంటుంటే.. నిన్ను చూస్తే ఒక మాట అనాలనిపిస్తుందని రాజ్ అనగా.. ఏంటని కావ్య అడుగుతుంది. మేడం సర్ మేడం అంతే అని రాజ్ అంటాడు. తరువాయి భాగంలో కావ్య గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం ధాన్యలక్ష్మి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.