English | Telugu

Eto Vellipoyindhi Manasu : కొత్త వ్యక్తితో కలిసి శ్రీలత మాస్టర్ ప్లాన్.. టీవీలో వచ్చింది చూసి వాళ్ళిద్దరు షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -307 లో... రామలక్ష్మి ఆకలి అంటూ గట్టిగా అరుస్తుంటాడు సీతాకాంత్. అప్పుడే రామలక్ష్మి భోజనం తీసుకొని వస్తుంది. బాగుందంటూ సీతాకాంత్ ఫాస్ట్ గా తింటుంటే మెల్లగా తినండి అంటుంది రామలక్ష్మి. మీరు ఎక్కడున్నా రాజే అండి అని పెద్దావిడ అన్న మాటలు గుర్తుచేస్తుంది రామలక్ష్మి. నువ్వు నా పక్కన ఉంటేనే నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. నన్ను గొప్పగా చేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకని సీతాకాంత్ అంటాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తుంటారు.

శ్రీలత ఒకతనికి ఫోన్ చేస్తుంది. ఏంటి ఇన్ని రోజులకి గుర్తుకువచ్చానా అని అతను అనగానే.. నిన్ను మర్చిపోతేనా కదరా గుర్తుకురావడానికి అని శ్రీలత అంటుంది. ఒక సమస్య వచ్చిందంటూ జరిగిందంతా చెప్తుంది. ఇంకా సీతాకాంత్ గాడిని వదిలించుకోలేదా అని అతను అంటాడు. వాడి భార్య మమ్మల్ని టార్చర్ పెడుతుంది దాన్ని వదిలించుకోవాలని శ్రీలత అంటుంది. నేను చూసుకుంటా ముందు ఆ భద్రం గాడి ఫోటో పంపు అని అతను అంటాడు. శ్రీలత పంపిన భద్రం ఫోటో చూసి వీడు నాకూ తెలుసు కానీ వాడికి నేను తెలియదని అతను చెప్పాగానే అయితే పని మరింత సులువుగా అవుతుందని శ్రీలత అంటుంది. ఆ తర్వాత శ్రీలత పదే పదే గుమ్మం వంక చూస్తూ ఉంటుంది. ఎందుకు అలా చూస్తున్నారని శ్రీవల్లి అడుగుతుంది. కాసేపటికి రామలక్ష్మి వచ్చి నా కాళ్ళ మీద పడుతుంది.. ఇదే నా మాస్టర్ ప్లాన్ అని శ్రీలత చెప్తుంది.

రామలక్ష్మి తల స్నానం చేసి రెడీ అవుతుంటే సీతాకాంత్ వచ్చి ఇంకా నీ జుట్టు అరలేదంటూ జుట్టుని తుడుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక పెద్దావిడ వచ్చి రామలక్ష్మి.. నీ గురించి టీవీలో వస్తుందని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. తీరా చుస్తే.. శ్రీలత వాళ్ళింటికి రామలక్ష్మి వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలు ఎడిట్ చేసి అందులో వచ్చేలా చేస్తుంది. సీతాకాంత్ పేరుని అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తే అందరు ప్లాట్ తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళని మోసం చెయ్యొచ్చని ఎడిట్ చేస్తారు. అది టీవీలో వస్తుంది. దాన్ని చూసి రామలక్ష్మి, సీతాకాంత్ లు షాక్ అవుతారు. శ్రీవల్లి వాళ్ళకి టీవీలో వచ్చేది శ్రీలత చూపిస్తుంది. ఇక ప్రాబ్లమ్ మీది కాదు రామలక్ష్మి, సీతాకాంత్ లది అని సందీప్ వాళ్ళకి చెప్తుంది శ్రీలత. ఆ తర్వాత ఎందుకు అక్కడికి వెళ్ళావంటూ రామలక్ష్మి పై సీతాకాంత్ కోప్పడతాడు. నీ వల్ల ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు మొత్తం పోయేలా ఉందని సీతాకాంత్ అంటాడు. అప్పుడే మాణిక్యం వచ్చి ఆఫీస్ దగ్గరికి జనాలు వచ్చి గొడవ చేస్తున్నారని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.