English | Telugu

Brahmamudi : అనామికని చూసి షాకైన కావ్య.. ఆ డిజైన్ ఇస్తుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -527 లో.....రాజ్ ఆఫీస్ కి వెళ్లేసరికి అందరూ వర్క్ చేయకుండా తమకి నచ్చిన పని చేస్తుంటారు. దాంతో రాజ్ కి కోపం వచ్చి.. ఇప్పుడు మిమ్మల్ని జాబ్ లో నుండి తీసేయాలి అనుకుంటే క్షణం పట్టదు. ఇన్ని రోజులు పని చేశారని ఆలోచిస్తున్నా ఇక ముందు చేయబోయే వర్క్ పై దృష్టిపెట్టండి. లేదంటే అందరి జాబ్ తీసేస్తా అని రాజ్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత జరిగే ఎక్స్పో కీ డిజైన్స్ రెడీ చెయ్ అని శృతికి రాజ్ చెప్తాడు. లాస్ట్ ఇయర్ కావ్య మేడం రెడీ చేశారని శృతి అనగానే.. అంతకుముందు మనమే రెడీ చేశాం.. చెప్పింది చెయ్ అని రాజ్ అంటాడు.

మరొకవైపు కావ్య వర్క్ చేసే తన బాస్ దగ్గరికి వెళ్తుంది. ఈ సారి పెద్ద కంపెనీతో టైఅప్ అయ్యాం మంచి డిజైన్స్ వెయ్యండి అని తన బాస్ కావ్య కి చెప్పగానే.. నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత ఆ బాస్ అనామిక దగ్గరికి వెళ్తాడు. కావ్య డిజైన్స్ సామంత్ గ్రూప్ ఇండస్ట్రీ వాళ్లకి వెళ్తున్నాయని కావ్య తెలియొద్దని అతనికి చెప్తుంది అనామిక. ఆ తర్వాత రాజ్ కి సామంత్ ఎదురుపడుతాడు. ఇక ఇప్పుడు నా కంపెనీ నెంబర్ వన్ కావాడానికి రెడిగా ఉందని సామంత్ అంటాడు. ఇద్దరు కాసేపు వాదించుకుంటారు. ఆ తర్వాత సామంత్ కి అనామిక ఫోన్ చేస్తుంది. ఇక్కడ రాజ్ నాతో ఛాలెంజ్ చేస్తున్నాడని సామంత్ అనగానే.. వాడి కంపెనీ త్వరలోనే ఓటమి కాబోతుంది. నువ్వు అయితే నామినేషన్ వెయ్ అని అంటుంది. ఆల్రెడీ ఎప్పుడో నామినేషన్ వేసానని సామంత్ అంటాడు. అయితే త్వరగా ఇంటికి రా బేబీ.. నీ కోసం వెయిట్ చేస్తుంటా అని అనామిక అంటుంది. మరొకవైపు అప్పుని కళ్యాణ్ పోలీస్ కోచింగ్ దగ్గరికి తీసుకొని వస్తాడు. అక్కడ ఫీజు ఎక్కువ అనడంతో అప్పు వద్దని వెనక్కి వస్తుంది. నేను ఎలాగోలా కష్టపడి డబ్బులు తెస్తాను. నువ్వు కోచింగ్ తీసుకోమని కళ్యాణ్ అంటాడు. అయినా అప్పు వినదు.

ఆ తర్వాత రాజ్ ఇంటికి వచ్చి ఆఫీస్ సిచువేషన్ గురించి చెప్తాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావ్ .. ఇన్ని రోజులు రాహుల్ వెళ్ళాడని ఇలా అంటున్నావా అని రుద్రాణి అంటుంది. ఇన్ని రోజులు ఆలోచించలేదు..‌ ఇక అలోచిస్తా.. ఎవరు ఎంత మింగారో అర్ధం అవుతుందని రాజ్ అంటాడు. ఇప్పుడు బాగా అయిందా అని ప్రకాష్ అంటాడు. ఈ సంవత్సరం డిజైన్ ఎక్స్పో పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారట.. అందులో మనకే అవార్డు రావాలి.. అప్పుడే మళ్ళీ కంపెనీకీ మంచి పేరు వస్తుందని రాజ్ అంటాడు. అయితే అలా డిజైన్స్ కావ్య బాగా వెయ్యగలదు. తనని తీసుకొని రా అని సుభాష్ అంటాడు. నేను తీసుకొని రాను నేను ఎలాగైనా అవార్డు తీసుకొని వస్తానని రాజ్ అంటాడు. మరొకవైపు కావ్య డిజైన్స్ వేయకుండా రాజ్ కావ్య ఫోటోని వేస్తుంది. కనకం వచ్చి నీ మనసులో ఏముందో.. అది పేపర్ పై వేసావని కనకం అంటుంది. మరొకవైపు రాజ్ దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది. తరువాయి భాగంలో ఎక్స్పో లో డిజైన్ పెట్టడానికి కావ్య ఇంకా డిజైన్ తీసుకొని రాలేదని కావ్య బాస్ తో సామంత్ అంటాడు. అప్పుడే కావ్య వస్తుంది. అక్కడ అనామికని చూసి కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.