Read more!

English | Telugu

Brahmamudi : దుగ్గిరాల ఇంట్లో కొత్త ట్విస్ట్.. బయటకు వెళ్లిపోతానన్న ఇంటికోడలు!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -404 లో....కావ్య ఆ వీడియో చూసిన తర్వాత ఎమోషనల్ అవుతూ దేవుడికి మొక్కుకుంటుంది. తన కొడుకు తప్పు చేస్తేనే మా అత్తయ్య తట్టుకోలేదు.. అలాంటిది తన భర్త తనకి అన్యాయం చేశాడంటే ఎలా తట్టుకుంటుందని కావ్య అనుకుంటుంది..ఆ తర్వాత ప్రకాష్ ఆఫీస్ కి వెళ్లకుండా ఇంట్లో సిచువేషన్ గురించి బాధపడుతుంటే.. ధాన్యలక్ష్మి వచ్చి ఇంకా ఆఫీస్ కి వెళ్ళాలేదా అని అడుగుతుంది.

ఇంకా ఇలా ఉంటే ఎలా వెళ్ళాలి అనిపిస్తుంది.. రేపటితో రాజ్ కి ఇచ్చిన గడువు పూర్తవుతుందని ప్రకాష్ అంటాడు. రాజ్ నిజం చెప్పడు.. ఇంట్లో నుండి వెళ్లిపోతాడని ధాన్యలక్ష్మి సంబంధం లేనట్టు మాట్లాడుతుంది. మరొకవైపు కావ్య, అప్పు ఇద్దరు ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటారు. అసలు నిజం తెలిసింది కదా అక్క.. వెళ్లి అందరి ముందు బావ ఏ తప్పు చెయ్యలేదని చెప్పమని అప్పు అంటుంది. అలా మీ బావ ఎప్పుడో చెప్పేవారు.. అలా చెప్పలేదంటే ఇంట్లో వాళ్ళ అమ్మ గురించి ఆలోచించే కదా అని కావ్య అంటుంది. ఇన్ని రోజులు పాపం అందరి ముందు బావని అవమానించామని అప్పు అంటుంది. ఆ పెన్ డ్రైవ్ అయితే భద్రంగా పెట్టు ఎందుకంటే మీ మావయ్య బాబు అని చెప్పే ఒకే ఒక సాక్ష్యమని అప్పు అనగానే.. కావ్య రాయి తో పెన్ డ్రైవ్ ని పగులగొడుతుంది. ఏం చేస్తున్నావని అప్పు అడుగుతుంది. ఒకరి జీవితం నాశనం చేసే సాక్ష్యం అవసరం లేదని కావ్య అంటుంది.

ఆ తర్వాత రాహుల్ , రుద్రాణి ఇద్దరు మాట్లాడుకుంటారు. రేపటితో రాజ్ కి ఇచ్చిన గడువు పూర్తవుతుందంటూ మాట్లాడుకుంటారు. సేట్ రుద్రాణికి ఫోన్ చేసి నా కోటి నాకు ఇవ్వని అడుగుతాడు. రుద్రాణి టెన్షన్ పడుతుంటే అప్పుడే వచ్చిన స్వప్న.. ఏదో కోటి రూపాయలు పోయాయంన్నారు వెళ్లి ఇంట్లో అందరికి చెప్దామంటూ రుద్రాణికి చుక్కలు చూపిస్తుంది. ఆ తర్వాత రాజ్ ని కావ్య చూస్తూ.. తండ్రి కోసం చెయ్యని తప్పుని మోస్తున్నారని అనుకుంటుంది. రాజ్ కిందకి వెళ్తుంటే అపర్ణ పిలిచి.. ఇప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నావా.. రేపు వెళ్తున్నావా అంటూ అడిగేసరికి.. నీ నిర్ణయం మార్చుకోవా అంటు అపర్ణతో అక్కడే ఉన్న ఇందిరాదేవి అంటుంది. తరువాయి భాగంలో బాబు గురించి రాజ్ నిజం చెప్పకుంటే.. నేనే ఇంట్లో నుండి వెళ్లిపోతానని అపర్ణ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.