English | Telugu

Brahmamudi : బాబుపై కావ్య చూపిస్తున్న కేరింగ్ చూసి ఇంప్రెస్ అయిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -368 లో..ప్రకాష్ కావాలనే రాహుల్ ఆర్డర్ చేసిన ఫుడ్ ని వెనక్కి పంపిస్తాడు. అంతే కాకుండా ఇంట్లో ఉన్న ఫుడ్ కూడా డెలివరీ బాయ్ తో ఇచ్చి పంపిస్తాడు. అది చూసిన రాహుల్, రుద్రాణి, అనుపమ, ధాన్యలక్ష్మి అందరు అవాక్కవుతారు. ఇంట్లో అందరు బాధతో తినకుండా ఉంటే మీరు మాత్రం తింటారా? నా మతిమరుపుని అడ్డం పెట్టుకొని ఇది చేశానని ప్రకాష్ అనుకుంటాడు.

ఆ తర్వాత బాబు నిద్ర పోకుండా ఏడుస్తుంటే రాజ్ ఇబ్బంది పడుతాడు. బాబుకి పాలు మాత్రమే కాకుండా ఉగ్గు కూడా తినిపంచాలని కావ్య చెప్తుంది. అదెక్కడ దొరుకుతుందని రాజ్ అమాయకంగా అడుగుతాడు. ఆ తర్వాత కావ్య బయటకు వెళ్లి ఉగ్గు తీసుకోని వస్తానంటూ వెళ్తుంటుంది. బయటే ఉన్న కళ్యాణ్ ఎక్కడికి వదిన అని అడుగుతాడు. బాబుకి ఉగ్గు తేవడానికి అని కావ్య అనగానే.. ఇంత రాత్రి మీరెందుకు నేను వెళ్తానంటూ కళ్యాణ్ వెళ్తాడు. అదంతా అనామిక చూస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఉగ్గు తీసుకొని వస్తాడు. కావ్య, కళ్యాణ్ ఇద్దరు లోపలికి వస్తుంటే.. అందరు హాల్లోనే ఉంటారు. మా ఆయనని సేవకుడిగా, బానిసగా చేస్తున్నారు.. పెద్దత్తయ్య కూడా ఎలాంటి హెల్ప్ చెయ్యద్దన్నారు కానీ మీ కోడలే మీ మాట వింటలేదని అనామిక అంటుంది. ఆ తర్వాత అనామికపై కళ్యాణ్ కోప్పడతాడు. నేనేం తప్పు చేశానని ఇంత మందిని పోగు చేసావని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కావ్య వెళ్లి బాబుకి ఉగ్గు తినిపిస్తుంది.

బాబుని ఎత్తుకొని రాజ్ బాల్కనీలో అటు ఇటు తిరుగుతుంటే అప్పుడే కావ్య వచ్చి.. బాబుని తీసుకొని వెళ్లి ఉయ్యాలలో వేస్తుంది. కాసేపు బాబుని పడుకోపెడుతుంది. రాత్రంతా కావ్య మేల్కొని ఉండి మరీ బాబుని పడుకోపెడుతుంటే.. అది చూసిన రాజ్ ఇంప్రెస్ అవుతాడు. తరువాయి భాగంలో ప్రకాష్ దగ్గరికి సుభాష్ వచ్చి.. ఆ కాంట్రాక్ట్ ఎందుకు క్యాన్సిల్ అయిందని అడుగుతాడు. ఆ తర్వాత ఆ కాంట్రాక్ట్ వల్ల కోటి రూపాయలు లాస్ అయింది.. అది రాజ్ వల్లే అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.