English | Telugu

యష్మీ గౌడ చెప్పిన నిజాలివే.. అసలేం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ కథ ప్రధానంగా ముగ్గురి చుట్టూ తిరుగుతుంది. అందులో ముకుంద పాత్ర విలన్ రోల్ లో ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఈ పాత్రలో యష్మీ గౌడ అందరికి దగ్గరైంది‌. అయితే సడన్ గా తను తప్పుకొని కొత్త యాక్టర్ రావడంతో.. యష్మీ గౌడని ఎందుకు తొలగించారని ఈ సీరియల్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

కృష్ణ ముకుంద మురారి సీరియల్ లో కథ రోజు రోజుకి చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి చేసుకున్న కృష్ణ, మురారిల మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే వీరిద్దరి పెళ్ళి ముందు ముకుందని మురారి ప్రేమిస్తాడు. కాగా మురారి వాళ్ళ అన్న ఆదర్శ్ ని ముకుంద పెళ్ళిచేసుకొని అదే ఇంటికి వస్తుంది. దీంతో ఆదర్శ్ కి ముకుంద ప్రేమ విషయం తెలిసి ఇంటి నుండి వెళ్ళిపోతాడు. ఇక ముకుంద ఒంటరిగా ఉంటూ మురారి తన ప్రేమను పొందాలని తపిస్తుంటుంది‌. అయితే తాజా ఎపిసోడ్ లలో ముకుంద చనిలోయిందని అందరిని నమ్మించి, తన రూపం మార్చుకుంటుంది. మురారిని జైలునుండి విడిపించి మీరాగా అందరికి పరిచయమవుతుంది. పేద అమ్మాయి, ఆత్మాభిమానం గల అమ్మాయి అని చెప్పి భవానిని కూడా నమ్మించి ఏకంగా ఇంటిలోకి ప్రవేశిస్తుంది. అయితే ముకుంద పాత్రలో చేస్తున్న యష్మీ గౌడని తప్పించి కొత్త క్యారెక్టర్ ని తీసుకోవడంపై అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేయగా వాటన్నింటికి యష్మీ గౌడ సమాదానాలిచ్చింది.

ముకుంద అలియాస్ యష్మీ గౌడ తనెందుకు తప్పుకుందో తను సొంతంగా మొదలెట్టిన యూట్యూబ్ ఛానెల్ లోని ఓ వ్లాగ్ ద్వారా చెప్పుకొచ్చింది. పేమెంట్ రిలేటెడ్ ఇష్యూ ఏమైనా ఉందా అని చాలామంది అడిగారంట.. పేమెంట్ రిలేటెడ్ ఇష్యూలు ఏమీ లేవు.. నా అంతట నేనే బయటకొచ్చానని యష్మీ గౌడ రిప్లై ఇచ్చింది. మీ కాంట్రాక్ట్ డేట్ , అగ్రిమెంట్ ఏమైనా పూర్తయిందా అని కొందరు అడుగగా.. అదేం లేదని, సీరియల్ ఇంకా రన్ అవుతుందిని.. తను తప్పుకోవాలనుకుంటున్నా అని ప్రభాకర్ గారికి చెప్పినప్పుడు సర్ అర్థం చేసుకున్నాడని, చాలా మ్యూచ్యువల్ గా బయటకు వచ్చానని యష్మీ గౌడ అంది. సూపర్ జోడీ డ్యాన్స్ షో వల్ల మానేసారా అని కొందరు అనగా.. అలాంటిదేం లేదని, దేని టైమ్ దానిదే అని అంది. ముకుంద క్యారెక్టర్ చాలా నెగెటివ్ అయిపోతుందనా మానేసావా అని కొందరు అడుగగా.‌. అవునని అది కూడా కొంతవరకు కారణమే అని అంది. కొంతమంది నా పర్సనల్ ప్రొఫైల్ కి వచ్చి మరీ వల్గర్ గా కామెంట్ చేస్తున్నారని , టీవీలో వచ్చే ఓ క్యారెక్టర్ ని చూసి అలా పర్సనల్ గా వచ్చి బాధపెట్టకూడదని, అది తప్పు అని యష్మీ అంది. అయితే తనకి గత నాలుగైదు సంవత్సరాల నుండి గ్యాప్ దొరకడం లేదని, కాస్త గ్యాప్ తీసుకుందామని తప్పుకున్నట్టుగా, ఇందులో సీరియల్ వాళ్ళ నుండి ఎలాంటి ప్రెషర్ లేదని, సీరియల్ నుండి తప్పుకోవడం నా సొంత నిర్ణయమని యష్మీ అంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.